Home న్యూస్ F3 లో నారప్ప….థియేటర్స్ దద్దరిల్లిపోయాయి!!

F3 లో నారప్ప….థియేటర్స్ దద్దరిల్లిపోయాయి!!

0

విక్టరీ వెంకటేష్ నుండి ఆడియన్స్ ఎప్పటి నుండో ఊరమాస్ జానర్ లో ఒక సినిమా చూడాలని ఆశగా ఉండగా తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగు లో నారప్ప పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా పాండమిక్ టైం లో థియేటర్స్ లో రిలీజ్ చేయడం కుదరక ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేశారు…

థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించి ఉండేది ఈ సినిమా… డిజిటల్ లో చూసిన వాళ్ళు సైతం ఈ సినిమా థియేటర్స్ లో చూసి ఉంటే బాగుండేది అనుకున్నారు, ఈ విషయాన్నీ తెలుసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి….

వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన ఎఫ్3 మూవీ లో నారప్పని కూడా కలిపేశాడు…. క్లైమాక్స్ సీన్ లో నారప్ప కోసం అన్నట్లు ఓ సీన్ ని పెట్టేసి వెంకీ ఓ రూమ్ లోపలి కి వెళ్లి నారప్ప గెటప్ లో తిరిగి వచ్చి….

విలన్స్ ని కత్తితో నరుకుతాడు…. సడెన్ గా నారప్ప గెటప్ ఏంటి అని వరుణ్ తేజ్ అడిగితె….OTT లో రిలీజ్ చేశాం కదా థియేటర్స్ ఆడియన్స్ మిస్ అయ్యారు కదా అని వాళ్ళని ఖుషీ చేద్దామని వచ్చా అంటూ పలికిన డైలాగ్స్ ఆ యాక్షన్ బిట్ కి థియేటర్స్ నవ్వుకుంటేనే ఓ రేంజ్ లో దద్దరిల్లిపోయాయి అని చెప్పాలి. నారప్ప సినిమాను మిస్ అయిన వాళ్ళకి…

ఈ సడెన్ ట్విస్ట్ థియేటర్స్ లో కొత్త సర్పైజ్ గా మారి ఓ రేంజ్ లో అలరించింది అని చెప్పాలి. తర్వాత వరుణ్ తేజ్ కూడా వకీల్ సాబ్ గెటప్ తో అదరగొట్టగా ఈ క్లైమాక్స్ బిట్ లో ఈ రెండు సీన్స్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో జోష్ నింపింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here