టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో ఒక టైంలో ఎపిక్ ఫ్లాఫ్స్ తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్న టైంలో మిర్చి(Mirchi) తో బ్లాక్ బస్టర్ కొట్టిన కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేసిన శ్రీమంతుడు(Srimanthudu) సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను…
సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోగా, ఆ సినిమా రిలీజ్ టైం నుండి ఈ సినిమా కథ కాపీ అంటూ ఒక రచయిత కేసు వేయగా ఆ కేసు మళ్ళీ ఇప్పుడు 2024 టైంలో వార్తల్లో నిలుస్తూ ఉండగా…ఒరిజినల్ నవల కథకి శ్రీమంతుడు కథ ఆల్ మోస్ట్ సిమిలర్ గా ఉండగా….
ఆ నవల రాసిన శరత్ చంద్ర మేకర్స్ అండ్ టీం నుండి అపాలజీ కావాలంటూ రీసెంట్ గా స్టేట్ మెంట్ ఇవ్వగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నవలను సినిమాలా తీయాలి అనుకున్నామని కథ ఆల్ మోస్ట్ నారా రోహిత్(Nara Rohit) కి చెప్పి ఇక సెట్స్ మీదకి సినిమాను తీసుకు వెళ్ళాలి అనుకున్న టైంలో…
అప్పటికే శ్రీమంతుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో చేసేదేమీ లేక ఈ సినిమాను ఆపేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు శరత్ చంద్ర…. మొత్తం మీద నారా రోహిత్ తో చేయాలి అనుకున్న శ్రీమంతుడు ఒరిజినల్ కథను నవలలో చూసి కొన్ని మార్పులు చేర్పులతో మహేష్ బాబుతో చేశారు అంటున్నారు…
ఓవరాల్ గా స్టార్ డం పరంగా చూసుకుంటే సేమ్ కథ నారా రోహిత్ చేసి ఉంటే మంచి పేరు వచ్చి ఉండేది ఏమో కానీ మహేష్ బాబు చేయడం వలెనే మరో లెవల్ కి సినిమా వెళ్ళింది అని అభిప్రాయ పడొచ్చు, కానీ అదే టైంలో నవల ప్రకారం నారా రోహితే చేసి ఉంటే తన కెరీర్ కి సినిమా బాగా హెల్ప్ అయ్యి ఉండేదేమో… మొత్తం మీద రిలీజ్ అయిన ఇన్నేళ్ళకి మళ్ళీ శ్రీమంతుడు మూవీ వార్తల్లో నిలిచింది.