Home న్యూస్ లాస్ట్ 40 నిమిషాలు…రవితేజ మాస్ తాండవం అంట…కాచుకోండి!

లాస్ట్ 40 నిమిషాలు…రవితేజ మాస్ తాండవం అంట…కాచుకోండి!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగిల్(Eagle Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఆల్ రెడీ క్లిక్ అవ్వడం, విజువల్స్ అండ్ గ్రాండియర్ సినిమా కాన్సెప్ట్ ఆసక్తిగా అనిపిస్తూ ఉండటంతో…

సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రవితేజకి సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా వరకు పాజిటివ్ గానే వినిపిస్తూ ఉండగా రవితేజ కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇప్పుడు.

ఇక సినిమా గురించిన మరో ఆసక్తి కరమైన వార్తా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా టీం నుండి ఈ వార్తా వినిపిస్తుంది, ఆ వార్తల ప్రకారం సినిమా మొత్తం ఒకెత్తు అయితే లాస్ట్ 40 నిమిషాల సినిమా మరో ఎత్తు అంటున్నారు, ఆ 40 నిమిషాల సినిమా టేకింగ్, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు…

సినిమా ఎండ్ అయ్యే టైం కి వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేసే రేంజ్ లో ఉంటాయి అని అంటున్నారు, మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజం అయితే మట్టుకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం అయితే ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here