బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయిన నరసింహా నాయుడు సినిమాను బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఈ నెల 10 న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రీ మాస్టర్ వర్షన్ ను 4K లో గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతుండగా బాలయ్య సినిమాలు అంటే ఎక్కువగా రాయలసీమ ఏరియాలో…
మరో లెవల్ లో క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మరింత జోరుగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండగా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ లో రచ్చ చేస్తూ సీడెడ్ లో పలు మేజర్ ఏరియాలలో హైర్స్ ను…
సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. కొత్త సినిమాల రిలీజ్ టైంలోనే ఒక ఏరియాని గంపగుత్తుగా కొనడం ఆ ఏరియాలో వచ్చిన మొత్తం లాభాలు నష్టాలతో సంభందం లేకుండా కొన్న వ్యక్తీ తీసుకుని కొన్న రేటుని సినిమా ఆ ఏరియా కలెక్షన్స్ లో కలపడాన్ని హైర్స్ అంటారు..
చాలా వరకు కొత్త సినిమాల విషయంలోనే ఇది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న నరసింహా నాయుడు సినిమాకి కడపలోని SR సినిమాస్ లో 5 షోలకు గాను 1.6 లక్షల హైర్స్ కట్టారు. ఆ 5 షోలకు ఎంత మొత్తం వస్తే అంత మొత్తం కొన్న వ్యక్తీకి చెల్లుతుంది. ఇక మరి కొన్ని ఏరియాలలో కూడా ఈ హైర్స్ నరసింహా నాయుడుకి సొంతం అయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుంటుందో చూడాలి.