బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ…
నరసింహా నాయుడు సినిమాను బాలయ్య పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే… భారీగానే సినిమాను రిలీజ్ చేయబోతున్నప్పటికీ కూడా ప్రమోషన్స్ పరంగా మాత్రం పోస్టర్స్ తోనే సరిపెట్టారు మేకర్స్… బాలయ్య సినిమాలు అంటే సీడెడ్ లో…
ఎప్పుడూ హడావుడి ఉంటుంది, ఈ సారి కూడా అక్కడ హడావుడి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అన్ని చోట్లా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ఏమాత్రం బుకింగ్స్ జోరుని అయితే చూపించడం లేదు అని చెప్పాలి ఇప్పుడు…
నైజాంలో అలాగే ఆంధ్రలో సినిమా బుకింగ్స్ చాలా వీక్ గా ఉండగా రాయలసీమ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని చోట్ల తప్పితే అన్ని చోట్లా కూడా బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన రీ రిలీజ్ బర్త్ డే మూవీస్ లో వీకేస్ట్ బుకింగ్స్ ఇప్పుడు ఈ సినిమాకే ఉన్నాయని అంటున్నారు.
కానీ బాలయ్య మూవీస్ అంటే ఆఫ్ లైన్ లోనే ఎక్కువ జోరు చూపించే అవకాశం ఉండటంతో రాయలసీమ లో కచ్చితంగా సినిమా జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి నరసింహా నాయుడు సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.