కొన్ని కొన్ని సినిమాలకు థియేటర్ రిలీజ్ కన్నా కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లాంటివి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి, ప్రయోగాత్మక సినిమాలకు ఇవి ఎక్కువ బెనిఫిట్ ని కలిగిస్తాయి, అవి అలరిస్తే కచ్చితంగా డిజిటల్ లో చూసే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది, ఇలా ఇప్పుడు కొంచం లేట్ అయినా కానీ లేటెస్ట్ గా డిజిటల్ రిలీజ్ ద్వారా సాలిడ్ పేరు ను సొంతం చేసుకున్న సినిమాగా కింగ్ నాగార్జున…
నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ వైల్డ్ డాగ్ ని చెప్పుకోవచ్చు. సినిమా ను ముందు డిజిటల్ రిలీజే చేస్తామని అనుకున్నారు, నెట్ ఫ్లిక్స్ అయితే ఏకంగా 28 కోట్ల భారీ రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది, కానీ నో చెప్పిన టీం సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గరే…
రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయితే ఫలితం మాత్రం తీవ్రంగా తేడా కొట్టింది, అసలు సినిమా ను చూడటానికి జనాలు ఏ దశలోనూ థియేటర్స్ కి అడుగు పెట్టకపోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ లో సగం కూడా అందుకోలేక డబుల్ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా…
కానీ ఇదే సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు వరకే కాదు సౌత్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం నేషనల్ మీడియా లో కూడా సినిమా చాలా బాగుంది అంటూ ఆర్టికల్స్ వస్తూ ఉండటం, ఇక విదేశాల్లో కూడా సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో వ్యూయర్ షిప్…
సాలిడ్ గా ఉండి ఆ వారంలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా ఉండటం లాంటివి సినిమాకి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లో మరింత రీచ్ దక్కేలా చేశాయి అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాకుండా ఉండి ఉంటే సినిమా కచ్చితంగా డిజిటల్ బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేదని చెప్పొచ్చు, కానీ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ అపవాదును కూడా ఇప్పుడు చాలా వరకు డిజిటల్ సక్సెస్ కవర్ చేస్తుంది అని చెప్పొచ్చు.