బాక్స్ ఆఫీస్ దగ్గర కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన క్లాసిక్ డాన్స్ మూవీస్ లా ఇప్పుడు జనాలు కొత్తగా వచ్చే క్లాసిక్ డాన్స్ మూవీస్ ని పెద్దగా ఆదరించడం లేదు, అలాంటి సినిమాలు కూడా దాదాపుగా రావడం ఆగిపోయింది. ఇలాంటి టైం లో ఆల్ మోస్ట్ ఎండ్ అవుతున్న క్లాసిక్ డాన్స్ బేస్ మూవీస్ ని తిరిగి గుర్తు చేయడానికి చేసిన సరికొత్త ప్రయత్నం నాట్యం సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా…
రిలీజ్ అవ్వగా సినిమాలో హీరోయిన్ అద్బుతమైన పెర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నా కథ ఆడియన్స్ ని అలరించేలా అస్సలు లేక పోవడం తో ఆ ఇంపాక్ట్ సినిమా పై గట్టిగానే పడింది. దాంతో ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని…
చూపెట్టలేక పోయింది. సినిమా సుమారు 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా 4 రోజుల టైం కి 20 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెప్పిన…
కలెక్షన్స్ కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో మరో 4 లక్షల దాకా షేర్ ని జోడించగలిగింది, అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా చెప్పిన కలెక్షన్స్. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు పూర్తీ అయ్యే టైం కి సినిమా 16 లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే 27 లక్షల దాకా గ్రాస్ ను…
ఓవరాల్ గా సొంతం చేసుకుంది. సినిమా ను ఓన్ గానే రిలీజ్ చేయడం తో బయ్యర్స్ కి పెద్దగా నష్టాలేమి రాలేదు కానీ మేకర్స్ కి థియేట్రికల్ రన్ వలన కొంత నష్టాలు వచ్చాయి. కానీ ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ ఓవరాల్ గా రికవరీ అయ్యారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.