Home న్యూస్ మమ్మోత్ RRR గ్లిమ్స్ రెడీ…బ్రేక్ చేయాల్సిన టార్గెట్ ఇదే!!

మమ్మోత్ RRR గ్లిమ్స్ రెడీ…బ్రేక్ చేయాల్సిన టార్గెట్ ఇదే!!

0

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం అభిమానులు సినీ లవర్స్ అందరూ ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా…

ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి జనవరి 7 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సినిమాలో ఇప్పటికే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రో టీసర్ లు రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఇంట్రో టీసర్ లు ఆల్ టైం రికార్డులను నమోదు చేశాయి.

ఇక ఇప్పుడు సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేస్తారు అనుకుంటే సినిమా టీం ఇండియా వైడ్ గా PVR థియేటర్ చైన్ తో పార్టనర్ షిప్ చేస్తున్న నేపధ్యంలో సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నవంబర్ 1 న ఉదయం 11 గంటలకి….

సినిమా అఫీషియల్ గ్లిమ్స్ రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు మేకర్స్… దాంతో ఈ గ్లిమ్స్ తో ఇండియా లో ఇప్పటి వరకు ఉన్న గ్లిమ్స్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి సరికొత్త గ్లిమ్స్ రికార్డ్ ను నమోదు చేయాలని ఫ్యాన్స్ ఇప్పుడు సిద్ధం అవుతూ ఉండగా ప్రీవియస్ రికార్డ్ కూడా టాలీవుడ్ మూవీ పేరిటే ఉంది… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానాల కాంబోలో…

వస్తున్న భీమ్లా నాయక్ గ్లిమ్స్ 24 గంటల్లో 8.49 మిలియన్ వ్యూస్ ని 728.6K లైక్స్ ని సొంతం చేసుకుని ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్లిమ్స్ రికార్డ్ ను నమోదు చేసింది, ఆ రికార్డ్ ను RRR గ్లిమ్స్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ ఇప్పుడు ఇండియాలోనే అప్ కమింగ్ గ్లిమ్స్ కి ఊహకందని టార్గెట్ ను సెట్ చేసి పెట్టడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here