Home న్యూస్ NBK109 గ్లిమ్స్ రివ్యూ…ఈ సారి లెక్క 100 నుండి మొదలు!!

NBK109 గ్లిమ్స్ రివ్యూ…ఈ సారి లెక్క 100 నుండి మొదలు!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ మూడు విజయాలతో దుమ్ము లేపే ఫామ్ లో ఉండగా మరో పక్క పాలిటిక్స్ లో కూడా హాట్రిక్ విజయాలను నమోదు చేసి అన్ని వైపులా కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో వాల్తేరు వీరయ్య(waltair veerayya) బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ డైరెక్షన్ లో…

బాలయ్య చేస్తున్న లేటెస్ట్ మూవీ NBK109 సినిమా మీద సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఇటు బాలయ్య ఫామ్ లో ఉండటం, అటు బాబీ కూడా ఫామ్ లో ఉండటంతో వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా సంచలనాలు సృష్టించడం ఖాయం అనిపించేలా ఉండగా లేటెస్ట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి..

మరో కొత్త గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఆల్ రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ మంచి హైప్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త గ్లిమ్స్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది.. దేవుడు మంచోడయ్య…దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు….వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది…జాలి, దయా, కరుణ….ఇలాంటి పదాలకి అర్ధమే తెలియని అసురుడు అంటూ…

మంచి ఎలివేట్ డైలాగ్ తో మెప్పించిన గ్లిమ్స్ లో బాలయ్య ఎంట్రీ తన లుక్ మెప్పించగా తర్వాత గుర్రం పై ఉన్న బాలయ్య కత్తితో ఒకరిని చంపేయడం, ఆ సీన్ కి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. ఓవరాల్ గా మరోసారి ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ చేసేలా ఊరమాస్ మూవీతోనే ఆడియన్స్ ముందుకు…

ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రాబోతున్న బాలయ్య అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్ టు బాక్ 70 కోట్ల షేర్ మార్క్ ని దాటడంతో ఈ సారి లెక్క 100 ని టచ్ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదు అని చెప్పాలి. ఇక గ్లిమ్స్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అలాగే ఈ రోజు పుట్టిన రోజుని జరుపుకుంటున్న బాలయ్యకి బర్త్ డే విషెస్ ని తెలియజేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here