Home న్యూస్ ఆదిపురుష్ బ్యాన్ చేయాల్సిందే….రచ్చ రచ్చ చేస్తున్నారుగా!!

ఆదిపురుష్ బ్యాన్ చేయాల్సిందే….రచ్చ రచ్చ చేస్తున్నారుగా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆది పురుష్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే. రామాయణం కథని ఇప్పటి టెక్నాలజీని జోడించి డిఫెరెంట్ గా చెప్పాలి అని డైరెక్టర్ ట్రై చేయగా… రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ లో క్వాలిటీ కానీ విజువల్స్ కానీ మరీ ఊహించిన దానికన్నా కూడా తక్కువగా ఉండటంతో…

కామన్ ఆడియన్స్ కి తోడూ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందగా క్వాలిటీలో 3D వర్షన్ బాగుంది అని కొత్తగా చెబుతున్నారు కానీ ఆడియన్స్ సినిమా నుండి ఇంకా ఎదో ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా మరో పక్క టీసర్ లో ఆంజనేయుడిని చూపించిన విధానం కానీ…

రావణుడిని చూపించిన విధానం అస్సలు బాలేదని, అసలు ఇది రామాయణం బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలా అయితే అనిపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో సినిమాను బ్యాన్ చేయాలి అంటూ నార్త్ ఆడియన్స్ రెండు రోజులుగా నాన్ స్టాప్ గా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. దానికి కౌంటర్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వీ సపోర్ట్ ఆదిపురుష్ అంటూ…

ట్రెండ్ చేస్తున్నా కానీ ఆదిపురుష్ సినిమా పై ఊహించని ఈ వ్యతిరేకతని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయలేదు అని చెప్పాలి. హనుమాన్ కానీ, రావణాసురుడు కానీ ఇలా ఉండేవాళ్ళు అని పురాణాల్లో పాత సినిమాల్లో చూపించిన విజువల్స్ కి పూర్తీ వ్యతిరేకంగా ఆదిపురుష్ లో వాళ్ళ లుక్స్ ఉండటంతో ఈ రేంజ్ లో సినిమా పై వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తం అవుతుంది అని చెప్పాలి.

దీనికి తోడూ సినిమా టీసర్ లో విజువల్స్ పలు వెబ్ సిరీస్ అలాగే పలు హాలీవుడ్ మూవీస్ నుండి కాపీ కొట్టారు అంటూ మరో నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండగా వీటన్నింటికీ సినిమా టీం త్వరలో ట్రైలర్ ని అద్బుతంగా కట్ చేసి సమాదానం ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here