కోలివుడ్ సెన్సేషన్ ధనుష్ వరుస పెట్టి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ ఉండగా రీసెంట్ గా తిరు సినిమాతో తమిళ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకోగా ఇప్పుడు నేనే వస్తున్నా అంటూ సైకలాజికల్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి ఆడియన్స్ నుండి అంతంత మాత్రమే అనిపించే రేంజ్ లో టాక్ సొంతం అయ్యింది. ఆ ఇంపాక్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పై కూడా పడగా…
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చాల సైలెంట్ గా సినిమాను రిలీజ్ చేయగా జనాలు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో సినిమా మొదటి రోజు తెలుగు లో పట్టుమని 20 లక్షల గ్రాస్ ను కూడా అందుకోలేదు. అందులో నుండి షేర్ 10 లక్షల రేంజ్ లోనే ఉండవచ్చు…
ఇక తమిళనాడులో సినిమా మొదటి రోజు మొత్తం మీద 6.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక కేరళ, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకోగా ఓవర్సీస్ లో కోటి రేంజ్ లో గ్రాస్ ను సినిమా…
సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో టోటల్ గా మొదటి రోజు 8.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది. సినిమా బిజినెస్ లెక్కలు ఏమి కూడా రివీల్ చేయలేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వీక్ స్టార్ట్ నే సొంతం చేసుకున్న సినిమా పొన్నియన్ సెల్వన్1 పోటి లో ఉండటం తో…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకుని హోల్డ్ చేసే అవకాశం లేనట్లే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ధనుష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక హిట్ తర్వాత ఇప్పుడు మరోసారి నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పాలి.