బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండు నెలలుగా టాలీవుడ్ కి హిట్ సొంతం అవ్వలేదు, మేజర్ తర్వాత వరుస పెట్టి మంచి నోటబుల్ మూవీస్ రిలీజ్ అయినా టికెట్ రేట్స్ విషయంలో మేకర్స్ చేస్తున్న తప్పులు, ఆ సినిమాల టాక్ గట్టి ఎదురుదెబ్బ కొట్టడంతో జనాలు అస్సలు థియేటర్స్ కి రావడం లేదు. ఇలాంటి టైం లో మరోసారి టాలీవుడ్ పెద్దలు రీసెంట్ గా మీట్ అయ్యి టికెట్ రేట్స్ పై నిర్ణయం తీసుకున్నారు…
ఆగస్టు 1 నుండి అమలు కాబోతున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం సినిమాల టికెట్ రేట్స్ లెక్కలు ఈ విధంగా ఉండబోతున్నాయి…
👉Small Movies
(A, B) – 100, 125, (C Centers) – 70, 125
👉Medium Movies
(A, B) – 112, 177, (C Centers) – 100, 177
👉Big Movies
(A, B) – 177, 295, (C Centers) – 150, 295
ఈ విధంగా చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి… కానీ ఈ రేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉన్నాయి అనే చెప్పాలి. మరి జనాలు ఈ రేట్స్ ని కన్సిడర్ చేసి మునుపటిలా భారీ సంఖ్యలో థియేటర్స్ కి వస్తారా లేక OTT కంటెంట్ కే జై కొడతారో చూడాలి…