ఆల్ మోస్ట్ 16 నెలల గ్యాప్ తర్వాత ఒక బిగ్ స్టార్ మూవీ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా కేసులు మళ్ళీ ఎక్కువ అవ్వడం, కొన్ని చోట్ల ఆంక్షలు లాంటివి పెట్టడం తో బిజినెస్ లో కొద్దిగా మార్పులు వచ్చినా కానీ పవర్ స్టార్ వకీల్ సాబ్ సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుని పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమా టాలీవుడ్ లో కూడా ఓవరాల్ గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో కూడా ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు… నార్మల్ టైం అయ్యి ఉంటె అవలీలగా టాప్ 10 లో చోటు దక్కించుకుని దుమ్ము దుమారం చేసి ఉండేది ఈ సినిమా…..
కానీ చాలా లేట్ అవ్వడం, అండ్ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మరీ అనుకున్న విధంగా లేకపోవడం తో టాప్ 18 ప్లేస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది, ఓన్ రిలీజ్ లెక్కలను కూడా కౌంట్ చేసుకుంటే టాప్ 12 లో నిలుస్తుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
1. Baahubali2 – 352cr
2. Saaho – 270cr
3. SyeRaa Narasimha Reddy-187.25Cr
4. SPYder – 125cr+
5. Agnyaathavaasi – 123.2cr
6. Baahubali1 – 118cr
7. Maharshi – 100CR
8. BharatAneNenu- 100cr
9. Sarileru Neekevvaru- 99.30Cr
10. Aravindha Sametha- 91cr
11. Vinaya Vidheya Rama – 90cr
12. VakeelSaab – 89.35Cr
13. KhaidiNo150- 89Cr
14. Sardar Gabbar Singh – 87.7cr
15. JaiLavaKusa- 86Cr
16. KaatamaRayudu – 84.5cr
17. Ala Vaikunthapurramuloo- 84.34Cr
18. Rangasthalam – 80Cr
ఇప్పుడు వకీల్ సాబ్ ఈ లిస్టులో చోటు సొంతం చేసుకోగా, త్వరలో వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి, పరిస్థితులు మరీ విషమం కాకుండా ఉంటే ఆ సినిమాలు అన్నీ కూడా బిజినెస్ పరంగా సంచలనాలను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇయర్ ఎండ్ కి ఈ లిస్టులో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.