యంగ్ హీరో నిఖిల్ కెరీర్ మొదట్లో జోరు చూపినా తర్వాత స్లో అయ్యాడు, మళ్ళీ స్వామిరారా సినిమా నుండి సినిమాల విషయం లో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి కథలను ఎంచుకుంటూ దూసుకు పోతుండగా మధ్యలో ఒకటి రెండు సినిమాలు నిరాశ పరిచాయి, లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమా తో మళ్ళీ గాడిలో పడ్డ లో నిఖిల్ తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్స్ లో ఒకటైన కార్తికేయ సినిమా…
సీక్వెల్ కార్తికేయ 2 ని భారీ లెవల్ లో పాన్ ఇండియా మూవీ గా మార్చాలని నిర్ణయం తీసుకోగా ముందు 18 కోట్ల రేంజ్ బడ్జెట్ లో అనుకున్నా తర్వాత అది 30 కోట్ల రేంజ్ కి మారగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో తిరిగి మొదలు అవుతుంది అనుకున్నా కానీ…
యూనిట్ ముందు ఫారన్ లొకేషన్స్ లో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేయగా పరిస్థితులు ఇంకా సద్దుకోక పోవడం తో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ని ఆపేశారు, దాంతో ఈ గ్యాప్ లో చందు మొండేటి ఓ చిన్న సినిమా చేయాలి అని ఫిక్స్ అవ్వగా నిఖిల్ ఈ గ్యాప్ లో తర్వాత కమిట్ అయిన సినిమాను…
కార్తికేయ 2 ప్లేస్ లో మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సుకుమార్ కథ అందించిన 18 పేజెస్ మూవీ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం, డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నిఖిల్ గజినీ లో సూర్య ల మెమొరీ లాస్ పేషెంట్ గా నటించబోతున్నాడు.
యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందబోతున్న ఈ సినిమా ను తక్కువ టైం లో కంప్లీట్ చేయాలి అన్నది టీం ప్లాన్ గా చెప్పుకుంటున్నారు, తర్వాత పరిస్థితులు సద్దుకుంటాయి కాబట్టి కార్తికేయ 2 ని మరింత భారీగా చిత్రీకరించాలి అన్నది ఆ టీం ప్లాన్ అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ 2 సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే నిఖిల్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.