Home న్యూస్ 4 కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన నిఖిల్….ఇవి సక్సెస్ అయితే రేంజు మరో లెవల్!

4 కొత్త సినిమాలను అనౌన్స్ చేసిన నిఖిల్….ఇవి సక్సెస్ అయితే రేంజు మరో లెవల్!

0

హ్యాపీడేస్ సినిమా తో టాలీవుడ్ కి హీరోగా నలుగురిలో ఒకరిగా ఎంటర్ అయిన హీరో నిఖిల్ సిద్దార్థ్, ఆ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత యువత సినిమా తో మరో హిట్ కొట్టగా తర్వాత అడపాదడపా యావరేజ్ సినిమాలు పడుతున్నా కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం గట్టిగానే ఎదురు చూసిన నిఖిల్ ఎట్టకేలకు స్వామిరారా సినిమా తో అద్బుతమైన విజయాన్ని టర్నింగ్ పాయింట్ ని సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ కార్తికేయ సినిమాతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన సినిమాల్లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఈ సినిమా తర్వాత విజయానికి దూరం అయిన నిఖిల్ మళ్ళీ అర్జున్ సురవరం సినిమా తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వగా అప్పటి నుండి నిఖిల్ కొత్త సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు, లేటెస్ట్ గా జూన్ 1 నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా తన అప్ కమింగ్ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు నిఖిల్, లిస్టు సూపర్ సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు.

ముందుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సుకుమార్ కథతో 18 పేజెస్ సినిమా వస్తుందని, తర్వాత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 ఉంటుందని, ఆ తర్వాత ఫస్ట్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయిన స్వామి రారా కి సీక్వెల్ స్వామి రారా 2 ఉండబోతుందని కన్ఫాం చేసిన నిఖిల్ వీటితో పాటు ఒక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఏసియన్ మూవీస్ బ్యానర్ లో…

మరో సినిమా ఉంటుందని, ఈ నాలుగు నా అప్ కమింగ్ మూవీస్ అని చెప్పుకొచ్చాడు. వేటి కవే డిఫెరెంట్ జానర్ లో ఉన్న ఈ మూవీస్ అన్నీ అనుకున్నట్లు ఒరిజినల్స్ లా సక్సెస్ అయితే మట్టుకు నిఖిల్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాల రిజల్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here