సినిమాల నిర్మాణంలో అతి జోక్యం కూడా ఒక్కోసారి ఎదురు దెబ్బ కొడుతుంది కొన్ని సార్లు ఫలిస్తుంది కూడా… ఇప్పుడు ఇదే జరిగింది, ఒక సినిమా విషయం లో చేసిన పని అప్పుడు వర్కౌట్ అయింది కదా ఈ సారి కూడా చేస్తే ఈ సారి గట్టిగా వికటించింది… టాలీవుడ్ లో స్టొరీ రైటర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కోన వెంకట్ కూడా ఒకరు… ఎక్కువగా శ్రీనువైట్ల సినిమాలకు కథలను అందించిగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర అవి సూపర్ సక్సెస్ అవ్వగా తర్వాత ఓన్ గా కథలను సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టగా మొదట్లో వర్కౌట్ అయినా తర్వాత ఎదురు దెబ్బలు కొట్టడం మొదలు అవ్వడంతో కథలను రాయడం మానేసి క్రియేటివ్ ప్రొడ్యూసర్ రోల్ చేయడం మొదలు పెట్టారు కోన వెంకట్…
నాని నటించిన నిన్ను కోరి కి ఇలానే పని చేయగా కథలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం తో ఆ కథ బ్యాగ్ డ్రాప్ ని మార్చేశారు… నిన్ను కోరి సెకెండ్ ఆఫ్ కథని ముందు ఇండియాలోనే తీయాలి అనుకున్నా తర్వాత మార్చి అమెరికా కి షిఫ్ట్ చేశారు. కథ దృశ్యా అప్పుడు సెట్ అయ్యి సినిమా హిట్ అయింది.
దాంతో తన క్రియేటివిటీ మరింత పెరిగి పోగా… తను లేటెస్ట్ గా పనిచేసిన అనుష్క నిశ్శబ్దం విషయంలో కొత్త డైరెక్టర్ అవ్వడం తో మరింత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వగా ముందుగా కథ బ్యాగ్ డ్రాప్ ని ఏదైనా హిల్ స్టేషన్ లో తీద్దామని ప్లాన్ చేయగా అలా కాదని… కథని ఫారన్ లొకేషన్ కి మార్చారు…
అంతే కాదు సినిమాలో ఫారన్ యాక్టర్ చేసిన రోల్ కి ముందు వేరే వాళ్ళని అనుకోగా, షూటింగ్ లొకేషన్ ని మార్చినట్లు ఆ యాక్టర్ ని మార్చేసి అక్కడ ఫారన్ యాక్టర్ ని తీసుకోవడం వలన బడ్జెట్ అంచనాలను మించి పోయిందని అంటున్నారు… నిన్ను కొరికి వర్కౌట్ అయింది ఇప్పుడు నిశ్శబ్దం సినిమా కి వచ్చే సరికి దెబ్బ కొట్టింది అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.