Home గాసిప్స్ 22 కోట్ల సినిమా….లేటెస్ట్ గాసిప్…13 కోట్ల నుండి భారీ రేటు ఆఫర్!!

22 కోట్ల సినిమా….లేటెస్ట్ గాసిప్…13 కోట్ల నుండి భారీ రేటు ఆఫర్!!

643
0

మెగా ఫ్యామిలీ నుండి లాంచ్ అవుతున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ అందించిన కథ తో లాంచ్ అవుతున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా ముందు రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా తర్వాత సినిమా పరిస్థితి అటు డైరెక్ట్ రిలీజా లేక థియేటర్స్ లో రిలీజ్ చేయాలా అన్న డౌట్ లోనే కొనసాగింది.

కాగా సినిమా కు ముందు పెట్టిన బడ్జెట్ 17 కోట్ల రేంజ్ లో ఉందని వార్తలు వచ్చినా తర్వాత రీ షూట్లు, లెంత్ ఎక్కువ అవ్వడం తో 22 కోట్ల మేర బడ్జెట్ అయిందని అంటున్నారు. ఇక సినిమా కి మొదట 16 – 17 కోట్ల రేంజ్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లు వచ్చినా కానీ…

నో చెప్పగా తర్వాత రేట్లు తగ్గి 13 కోట్ల రేంజ్ లోనే రావడం తో టీం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇక త్వరలో థియేటర్స్ రీ ఓపెన్ అవుతూ ఉండటం తో త్వరలో థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వడానికి ప్లానింగ్స్ చేస్తూ ఉండగా ఇంతలో సినిమా గురించిన ఒక లేటెస్ట్ అప్ డేట్…

ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది… ఆ వార్తా ప్రకారం సినిమా కోసం సడెన్ గా లీడింగ్ డిజిటల్ రిలీజ్ యాప్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సాలిడ్ రేటు ఆఫర్ చేశారట. ఎంత అనేది క్లియర్ గా రివీల్ చేయకపోయినా కానీ 18-19 కోట్ల మధ్యలో రేటు ఆఫర్ చేశారు ట్రేడ్ లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి..

ఇది ఇంతకుముందు వచ్చిన అన్ని ఆఫర్ల కన్నా కూడా సాలిడ్ రేటు అనే చెప్పాలి… పెట్టిన బడ్జెట్ కన్నా తక్కువే అయినా ఒక కొత్త హీరో సినిమా కి ఇంతకిమించి ఎక్కువ రేటు ఆశించడం కూడా తప్పే అవుతుంది, మరి టీం ఇప్పుడు ఈ ఆఫర్ ని ఓకే చేస్తారా లేదా దీపావళి టైం లో సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here