ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా ఔట్ బ్రేక్ ఎవ్వరూ ఊహించని కాదు, ఆల్ రెడీ ప్రపంచ దేశాల్లో ఎఫెక్ట్ ఉన్నా కానీ ఇండియా లో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాం కానీ ఆ ఎఫెక్ట్ 8 నెలలు గడిచినా కానీ అవ్వలేదు, మరో 6 నెలలు మినిమం ఇంపాక్ట్ చూపేలా ఉన్న ఈ పరిస్థితులు కేరళలో 2018 లో నిఫా వైరస్ వలన ఎఫెక్ట్ అవ్వగా అక్కడ ప్రభుత్వం ఎలా తక్కువ టైం లో నార్మల్ అయ్యిందో సినిమాగా తీశారు…
ఆ సినిమానే వైరస్… కొంచం డాక్యుమెంటరీ లా అనిపించినా కానీ మలయాళ ఆడియన్స్ ను మెప్పించిన ఈ సినిమా తెలుగు లో ఇప్పుడు నిఫా వైరస్ పేరుతో డబ్ అయ్యి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఆహా యాప్ లో సొంతం చేసుకోగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే… వాంతులు విరోచనాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యే వ్యక్తి నుండి వైరస్ ఒక్కొక్కరిగా అందరికీ ఎలా పాకింది, డాక్టర్లు ఈ విషయం ఎలా తెలుసుకున్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు, ప్రభుత్వం ఎలా ఈ పరిస్థితికి మూలం ఎలా కనుగున్నారు అన్నది కథ పాయింట్…
పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ అద్బుతంగా నటించి మెప్పించగా మనకు తెలిసిన నటీనటులు ఇందులో సీనియర్ నటి రేవతి గారు, మడోన్నా సెబాస్టియన్, రెహ్మాన్, టొవినో థామన్, పార్వతి మరియు మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా అద్బుతంగా నటించి మెప్పించారు. మనం ఇప్పుడు చూస్తున్నట్లు కరోనా పరిస్థితులు అప్పుడు నిఫా పరిస్థితులు సిమిలర్ గా ఉండగా…
క్వారంటైన్, మాస్కులు వేసుకోవాల్సిన అవసరం, వైరస్ వలన చనిపోయిన వారిని ఎలా దహనం చేశారు, అసలు వైరస్ మూలం ఏంటి అని ఎలా కనుగొన్నారు లాంటి విషయాలు అన్నీ కూడా బాగా చూపెట్టారు, కానీ లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది…
తెలుగు డైలాగ్స్ కొందరివి బాగున్నప్పటికీ కూడా చాలా మందివి డబ్బింగ్ లు అసలు సెట్ కాలేదు. ఇక స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండటం ఎడిటింగ్ కూడా నీరసంగానే ఉంటుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు సినిమాలో లేవు, కంప్లీట్ సీరియస్ నోట్ తో సినిమా రియల్ ఇంసిడెంట్లను గుర్తు చేస్తూ…..
ఒక డాక్యుమెంటరీలా సాగుతుంది, డైరెక్షన్ కూడా బాగానే ఉన్నప్పటికీ డాక్యుమెంటరీలా తీయడం వలన అది ఎంత రియల్ స్టొరీ అయినా కానీ చూసేటప్పుడు మాత్రం కొంచం బోర్ కొట్టక మానదు, అప్పటికీ ట్విస్ట్ టైప్ లో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా మొత్తం మీద సినిమా ఒక డాక్యుమెంటరీ ఫీలింగ్ నే ఎక్కువగా కలిగించేలా చేస్తుంది.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మనం చూసిన క్వారంటైన్ పరిస్థితులు, పేషెంట్ నుండి వైరస్ ఎన్ని విధాలుగా ఇతరలుకు సోకుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఎలా వ్యాప్తి చెందుతుంది అన్న విషయాలను చాలా బాగా చూపెట్టారు. క్లైమాక్స్ అసలు వైరస్ ఎలా….
ఒక వ్యక్తికి సోకింది అన్నది కూడా చూపెట్టారు కానీ డీటైలింగ్ ఏమి ఇవ్వలేదు… అయినా కానీ ప్రస్తుతం మనం చూసిన పరిస్థితులు అద్దం పట్టిన సినిమా డాక్యుమెంటరీలా చూస్తె బోర్ కొడుతుంది కానీ నిఫా వైరస్ గురించి అప్పుడు విన్న వాళ్ళు ఇప్పుడు అది ఎలా వచ్చిందో క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే సినిమా చూడొచ్చు.