బాక్స్ ఆఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం భీష్మ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ తర్వాత చేసిన చెక్ సినిమా కానీ రంగ్ దే సినిమా కానీ ఏమాత్రం ప్రభావాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయాయి. రెండు సినిమాలు కూడా డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా తో…
వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సాంగ్స్ కానీ టీసర్ ట్రైలర్స్ కానీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇవేవి రిలీజ్ కాకుండానే సినిమా పై ట్రేడ్ లో బజ్ ఏర్పడటంతో బిజినెస్ విషయంలో జోరు చూపించిన ఈ సినిమా…
మొత్తం మీద రాయలసీమ ఏరియాకి గాను బిజినెస్ ను పూర్తీ చేసుకుంది. అక్కడ మొత్తం మీద సినిమా కి 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ డీల్ జరిగినట్లు సమాచారం. ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ సినిమా నుండి ఎలాంటి స్టఫ్ ఏమి రిలీజ్ కూడా కాకున్నా బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.