యూత్ స్టార్ నితిన్ మాస్ అవతారంలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో చేసిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం…. అంజలి స్పెషల్ సాంగ్, నితిన్ మాస్ లుక్, ట్రైలర్ లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో కొద్ది వరకు అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా భారీ లెవల్ లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే సివిల్స్ క్లియర్ చేసి సర్వీస్ కోసం ఎదురు చూస్తున్న హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. తన కోసం మాచర్లకి వెళతాడు, అక్కడ ఆ ఊరు మొత్తం సముద్రఖని కంట్రోల్ లో ఉంటుంది, మరి హీరో తర్వాత ఏం చేశాడు అన్నది మొత్తం మీద మిగిలిన కథ…. ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు ఆల్ రెడీ…
టాలీవుడ్ లో వచ్చాయి. ఓ 15 ఏళ్ల క్రితం లాంటి స్టొరీ లో నితిన్ కి ఏం నచ్చి ఒప్పుకున్నాడో తెలియదు కానీ కథ ఓ ఫక్తు మాస్ కమర్షియల్ మూవీలో ఎలా ఉంటుందో అలానే సాగుతుంది, హీరో ఎంట్రీ, లవ్ సీన్, ఓ ప్రాబ్లం, ఒక ఊరు, ఆ ఊరిని ఆదుకోవడానికి హీరో వెళ్ళడం ఇలానే సినిమా సాగుతుంది, ఇలాంటి రొటీన్ స్టొరీలను అయినా జనాలు మళ్ళీ చూడాలి అంటే, కథనం ఆసక్తికరంగా ఉండాలి, కానీ ఇక్కడ అది కూడా లేక పోయింది.
వెన్నెల కిషోర్ కామెడీ ఓవర్ గా ఉన్నా అక్కడక్కడా ఆకట్టుకుంటుంది, నితిన్ మాస్ లుక్, జాతర ఫైట్ లో బాగా మెప్పించాడు, ఇక అంజలి స్పెషల్ సాంగ్ సినిమాకి మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఇవి తప్పితే సినిమా లో చెప్పుకోదగ్గ సీన్స్ ఏమి పెద్దగా మెప్పించ లేక పోయాయి అని చెప్పాలి.
పెర్ఫార్మెన్స్ పరంగా నితిన్ ఆకట్టుకోగా కృతి శెట్టి పర్వాలేదు అనిపిస్తుంది, మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో కొన్ని సీన్స్ లో కనిపించగా వెన్నెల కిషోర్ కామెడీ మరీ ఓవర్ గా ఉన్నా అక్కడక్కడా నవ్వులు అయితే వస్తాయి, ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ బోరింగ్ గా ఉంది అని చెప్పాలి.
సినిమాటోగ్రఫీ మెప్పించాగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఏం ఎస్ రాజశేఖర్ ఓ 15 ఏళ్ల క్రితం నాటి స్టొరీ పాయింట్ తో చెప్పిన ఈ కథ కంప్లీట్ ఫక్తు మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టించడం ఖాయం. కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇలా అన్ని విషయాల్లో డైరెక్టర్ నిరాశ పరిచాడు…
మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… నితిన్ మాస్ లుక్, జాతర ఫైట్, అంజలి సాంగ్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్లాట్ ఫస్టాఫ్, డైరెక్షన్, కోర్ స్టొరీ పాయింట్ ఇలా మైనస్ లు చాలానే ఉన్నాయి…… ఉన్నంతలో ఇది కంప్లీట్ ఫక్తు మాస్ మూవీ ని ముందే గమనించి…
రొటీన్ స్టొరీనే చూడబోతున్నాం అని ముందే ప్రిపేర్ అయ్యి థియేటర్స్ కి వెళితే వాళ్ళకి సినిమా పర్వాలేదు అనిపించవచ్చు, కానీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కూడా అలానే మ్యాజిక్ చేస్తుంది అనుకుంటే మట్టుకు తీవ్రంగా నిరాశ పరుస్తుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్….