యూత్ స్టార్ నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగ్ దే, బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ బాగానే ఉండటం తో మంచి టాక్ నే సినిమా సొంతం చేసుకుంది, కమర్షియల్ గా కూడా కచ్చితంగా వర్కౌట్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. సినిమా మొదటి వీకెండ్ వరకు బానే పెర్ఫార్మ్ కూడా చేసింది కానీ తర్వాతే చేతులు ఎత్తేసింది.
సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది, దానికి 2 కారణాలు. కరోనా పెరుగుతుంది అంటూ టీవీ లో బయపెట్టడం, మరోటి వీకెండ్ అయినా టికెట్ హైక్స్ తగ్గించక పోవడం, దాంతో సినిమా కలెక్షన్స్ ఆఫ్ లైన్ లో ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది.
మొత్తం మీద వీక్ డేస్ లో భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 5 వ రోజు నుండి 7 వ రోజు వరకు ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది. దాంతో మొదటి వారాన్ని ఇప్పుడు అతి కష్టం మీద ముగించిన ఈ సినిమా మొత్తం మీద 7 రోజుల్లో టోటల్ గా…
సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 5.43Cr
👉Ceeded: 2.04Cr
👉UA: 1.68Cr
👉East: 1.02Cr
👉West: 62L
👉Guntur: 1.13Cr
👉Krishna: 69L
👉Nellore: 49L
AP-TG Total:- 13.10CR (21.10Cr~ Gross)
KA+ROI: 74L
OS – 1.74Cr ( Updated)
Total World wide : 15.58CR(27Cr~ Gross)
ఇవీ సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద 23.9 కోట్లకు అమ్మగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారం లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 8.92 కోట్ల షేర్ ని ఇంకా సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, రెండో వారం లో ఏవైనా అద్బుతాలు జరిగితే తప్పితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం అసాధ్యం అనే చెప్పాలి.