బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది..
దానికి తోడూ పోటిలో వచ్చిన ఇతర సినిమాల బెటర్ టాక్ వలన తిరిగి తేరుకోలేక పోయిన సినిమా ఫైనల్ రన్ లో భారీ లెవల్ లో లాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగానే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా ఒక్కో ఏరియా నుండి ఫైనల్ షేర్ లెక్కలు వస్తూ ఉండగా…
నైజాం ఏరియాలో సినిమా ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా నైజాం లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ఏకంగా 43.50 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను అందుకోగా.. ఓపెనింగ్స్ నుండే సినిమా కుమ్మేస్తుంది అనుకున్నా కూడా..
మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా ఫైనల్ రన్ లో తీవ్రంగా నిరాశ పరుస్తూ ఓవరాల్ గా 19.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది…ఆల్ మోస్ట్ 43.50 కోట్ల బిజినెస్ లో సినిమా ఓవరాల్ గా…
45%లోపే రికవరీని సొంతం చేసుకున్న సినిమా బిజినెస్ లో ఏకంగా 24.15 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరుస్తూ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది ఇక్కడ…అన్ని చోట్లా నష్టాలు ఓ రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.
Sodhi appu game changer and pushpa biggest disaster of tfi kada