యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన చెక్ మరియు రంగ్ దే సినిమాలు రెండూ కూడా తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత ఇప్పుడు మాస్ కంటెంట్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాతో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్స్ కి సూపర్ హిట్ అయ్యి సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక సినిమా ట్రైలర్ త్వరలోనే రానుండగా ఈ సినిమా….
రిలీజ్ డేట్ ను ఆగస్టు 12న కన్ఫాం చేశారు… కానీ అదే రోజున తెలుగు లో ముందుగా అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ, సమంత యశోద మూవీలు అనౌన్స్ చేశారు. కానీ అనుకోకుండా ఇప్పుడు ఈ 2 సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి.
దాంతో ఇప్పుడు ఇండిపెండెంట్స్ వీకెండ్ లో పెద్దగా పోటి లేకుండా టాలీవుడ్ నుండి సోలో రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా లాంగ్ వీకెండ్ లో సాలిడ్ గా ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ ను నితిన్ ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి.