మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అడపా దడపా హిట్స్ తప్పితే ఎక్కువ శాతం ఫ్లాఫ్స్ తో కెరీర్ లో ఎక్కువ టైం డౌన్ ఫాల్ లోనే ఉన్న హీరోల్లో మంచు విష్ణు కూడా ఒకరు, అప్పుడప్పుడు కొన్ని హిట్స్ కొట్టినా తర్వాత మళ్ళీ ఫ్లాఫ్స్ వెక్కిరించడంతో తన మార్కెట్ ఎప్పుడూ స్టేబుల్ గా లేదు, ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ ఉన్న కారణంగా తన మార్కెట్ భారీ గా పడిపోయింది.
అప్పుడెప్పుడో సోలోగా దూసుకెల్తా సినిమాతో హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత 6 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్ తో కలిసి ఈడో రకం ఆడో రకం అంటూ మల్టీ స్టారర్ హిట్ కొట్టాడు… కానీ సోలో గా హిట్ కొట్టి ఏళ్ళు అవుతుండగా ఇప్పుడు ఎలాగైనా కంబ్యాక్ చేయాలనీ ఏకంగా…
50 కోట్ల బడ్జెట్ తో మోసగాళ్ళు సినిమా రూపొందించగా ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ పెద్దగా అనుకున్నట్లు సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. దాంతో అన్ని చోట్లా సినిమా ను ఓన్ గా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు హీరో…
ఇక 50 కోట్ల బడ్జెట్ లో 30 కోట్ల మేర అన్ని చోట్లా కలిసి సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో బడ్జెట్ రికవరీ కి సినిమా 20 కోట్ల మేర ఇంకా బిజినెస్ జరగాల్సి ఉండగా ఇప్పుడు మోసగాళ్ళు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా కలిపి 20 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ బడ్జెట్ ను రికవరీ చేసి…
నిర్మాత సేఫ్ అయ్యేలా చేసే అవకాశం ఉంటుంది….మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సినిమా ఎక్కువ శాతం తెలుగు వర్షన్ మీదే డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో టాక్ బాగుంటే చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఈ కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి..