బాక్స్ ఆఫీస్ దగ్గర యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది… ఎప్పుడో కాని సినిమాలు చేయడం కూడా లేదు ఈ హీరో… 2008 లో గోరింటాకు సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన రాజ శేఖర్ తర్వాత చేసిన ఏ సినిమా తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయారు. మళ్ళీ 2017 టైం లో గరుడ వేగ సినిమా తో మెప్పించినా కానీ ఆ సినిమా…
టార్గెట్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయింది, ఇక తర్వాత మళ్ళీ భారీ బడ్జెట్ తో చేసిన కల్కి సినిమా కూడా బాగానే ఉన్నప్పటికీ బిజినెస్ ను అందుకోలేక చతికిలపడింది… ఇలాంటి టైం లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కి చాలా టైం తీసుకున్న రాజశేఖర్…
రీసెంట్ గా కరోనా వలన ఇబ్బంది పడగా తర్వాత తేరుకుని ఒక బ్లాక్ బస్టర్ రీమేక్ తో కంబ్యాక్ కి సిద్ధం అయ్యారు. ఆ సినిమానే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా.. ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అవ్వగా అందుకుగాను…
మిస్సమ్మ ఫేం నీలకంఠని ఎంచుకోగా సినిమా మొదలు అయింది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా ఏమైందో ఏమో రీసెంట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తాల ప్రకారం డైరెక్టర్ ని మార్చేశారని అంటున్నారు. కారణాలు ఎంటో తెలియక పోయినా కానీ నీలకంఠ ప్లేస్ లో లలిత్ అనే కొత్త డైరెక్టర్ తో ఈ రీమేక్ ని రాజశేఖర్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది.
సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని… అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నీలకంఠ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయినా ఇలాంటి రా రస్టిక్ మూవీస్ చేయలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి ఇదీ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.