బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి బరిలో నిలిచిన మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా పోటి లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక తొలి వారం ముగిసే టైం కే పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుని బడ్జెట్ పరంగా భారీగానే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా కి మరో ఎదురుదెబ్బ కూడా ఇప్పుడు తగిలింది అని టాలీవుడ్ లో…
వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ హక్కులు రిలీజ్ కి ముందే అమ్ముడు పోగా సినిమాల షోలు స్టార్ట్ అయ్యే టైం లో డిజిటల్ పార్టనర్స్ ని అనౌన్స్ కూడా చేశారు.
కానీ జిన్నా సినిమా కి మాత్రం అలాంటివి ఏమి లేవు, సినిమా రిలీజ్ అయ్యాక మంచి ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పటికీ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఏవీ…
కూడా సేల్ అవ్వాలేదని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా ఎర్లీగా డిజిటల్ లో రిలీజ్ చేస్తే వ్యూవర్ షిప్ అయినా సాలిడ్ గా సొంతం అవుతుంది అనుకుంటే ఇప్పుడు అక్కడ కూడా దెబ్బ పడినట్లు అయింది.