Home న్యూస్ నూటొక్క జిల్లాల అందగాడు రివ్యూ…హిట్టా-ఫట్టా!

నూటొక్క జిల్లాల అందగాడు రివ్యూ…హిట్టా-ఫట్టా!

0

అవసరాల శ్రీనివాస్ మరియు రుహానీ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ నూటొక్క జిల్లాల అందగాడు… బాలీవుడ్ లో ఇది వరకే వచ్చిన బాలా, ఉడ్తా చమన్ లాంటి సినిమాల నుండి స్పూర్తి పొంది తీసినట్లు ట్రైలర్ ద్వారానా అర్ధం అయిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా ఆడియన్స్ ని ఎంతవరకు సినిమా అలరించిందో అన్నది తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే….

ఒక ఇన్ ఫ్రా కంపెనీలో పనిచేసే హీరో యంగ్ ఏజ్ లోనే బట్టతల రావడం తో విగ్గుతో మ్యానేజ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్ లో హీరోయిన్ ఎంటర్ అవ్వడం హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడం తర్వాత హీరోయిన్ కి హీరో అసలు విషయం తెలియడం జరుగుతుంది… తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ…

చాలా సింపుల్ కథనే అయినా నేటి యువత లో ఎక్కువ మంది రిలేట్ చేసుకునే స్టొరీ పాయింట్ ఇది… యంగ్ ఏజ్ లోనే జుట్టు ఊడిపోవడం కొందరిలో కాన్ఫిడెంట్స్ ని దెబ్బ తీస్తుంది… ఆ కాన్సెప్ట్ తోనే వచ్చిన నూటొక్క జిల్లాల అందగాడు ఫస్టాఫ్ వరకు బాగానే మెప్పించాడు.

హీరోగా అవసరాల తన డైలాగ్స్ తో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా హీరోయిన్ కూడా ఆకట్టుకుంది. ఫస్టాఫ్ వరకు కామెడీ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయ్యి మెప్పించగా ఇంటర్వెల్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సెకెండ్ ఆఫ్ కూడా ఇదే విధంగా ఉంటే బాగుణ్ణు అనుకున్న టైం లో సెకెండ్ ఆఫ్ మొత్తం కూడా ఎమోషనల్ టచ్ తోనే సరిపోతుంది…

బాలీవుడ్ లో వచ్చిన బాలా మరియు ఉడ్తా చమన్ సినిమాలు కూడా ఫస్టాఫ్ ఎంటర్ టైన్ చేసినా సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ వలన అంచనాలను అందుకోలేక పోయాయి. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ ఎమోషనల్ టచ్ ని పెంచడం వలన ఇక్కడ సెకెండ్ ఆఫ్ డ్రాగ్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సీన్స్ రిపీటివ్ గా అనిపిస్తాయి…

దాంతో సెకెండ్ ఆఫ్ డ్రాగ్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ కొంచం బెటర్ గా సీన్స్ వస్తూ ఉండగా మంచి ఫీల్ తో క్లైమాక్స్ ముగుస్తుంది. దాంతో ఫస్టాఫ్ ఆకట్టుకున్న రేంజ్ లో సెకెండ్ ఆఫ్ మెప్పించక పోయినా క్లైమాక్స్ ఆకట్టుకోవడం తో పర్వాలేదు సినిమా బాగుంది అనిపించే విధంగా సినిమా ముగుస్తుంది.

చాలా మందికి రిలేట్ అయ్యేలా అనిపించే నూటొక్క జిల్లాల అందగాడు ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పినట్లు అనిపించినా సినిమా పూర్తీ అయ్యే సరికి ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించే అవకాశం ఉంది… ఆల్ రెడీ వచ్చిన బాలా, ఉడ్తా చమన్ లను పోలి చాలా సీన్స్ ఉండగా అక్కడ వర్కౌట్ అవ్వని సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ ని ఇక్కడ ఎంటర్ టైన్ మెంట్ వే లో సెకెండ్ ఆఫ్ లో కూడా చెప్పి క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ అలానే పెట్టి ఉంటే సినిమా చాలా బాగా ఆకట్టుకునేది… ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here