బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సినిమాలు అనుకున్న రేంజ్ లో ఈ మధ్య పెర్ఫార్మ్ చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. భారీగా హాలిడేస్ వచ్చిన ఇండిపెండెన్స్ వీకెండ్ లో రిలీజ్ అయిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా కానీ అక్షయ్ కుమార్ నటించిన రక్షా భందన్ సినిమా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించడం లేదు… ఈ 2 సినిమాల భారీ రిలీజ్ వలన…
హిందీ లో కూడా రిలీజ్ ను ప్లాన్ చేసుకున్న కార్తికేయ 2 సినిమా కి స్క్రీన్స్ అసలు ఏమి దొరకలేదు. తొలిరోజు ఎలాగోలా 50 లోపు షోలు పడగా ఆ షోల నుండి 7 లక్షల దాకా కలెక్షన్స్ వచ్చాయి. కానీ నార్త్ ఆడియన్స్ కి సినిమా టాక్…
స్ప్రెడ్ అయిన తర్వాత థియేటర్స్ ని పెంచాల్సిందిగా డిమాండ్ మొదలు అయింది, మేజర్ నేషనల్ మల్టిప్లెక్స్ చైన్ మొత్తం లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా భందన్ సినిమాలు అగ్రిమెంట్స్ చేసుకోవడంతో జనాలు లేక పోయినా కానీ షోలు వేయాల్సిన పరిస్థితి ఉండగా, అక్కడ ఆడియన్స్ ఈ సినిమాలను చూడటానికి జనాలు ఎవ్వరూ…
రావడం లేదు, ఈ సినిమాలను థియేటర్స్ నుండి తీసేయండి, కార్తికేయ2 సినిమాను ప్రదర్శించండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వర్షం కురిపించడంతో రెండో రోజు ఏకంగా 150 షోలను హిందీ బెల్ట్ లో కార్తికేయ2 కి కేటాయించారు. ఇక మూడో రోజు మరింతగా షోలు అక్కడ పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… లోకల్ మూవీస్ లో ఎలాంటి కొత్తదనం లేక పోవడంతో…
డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సౌత్ మూవీస్ ని ఇష్టపడుతున్న నార్త్ ఆడియన్స్, కృష్ణుడి మీద తెరకెక్కిన కార్తికేయ2 పై ఆసక్తిని చూపిస్తున్నారు, అక్కడ షోలు డీసెంట్ గా పెంచి సినిమా యూనిట్ కొంచం బెటర్ గా సినిమాను ప్రమోట్ చేస్తే హిందీ లో ఈ సినిమా మంచి రెవెన్యూని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.