Home గాసిప్స్ ఎన్టీఆర్ 25 – రామ్ చరణ్ 25…జక్కన్న మాత్రం షాక్ ఇచ్చాడు!!

ఎన్టీఆర్ 25 – రామ్ చరణ్ 25…జక్కన్న మాత్రం షాక్ ఇచ్చాడు!!

3074
0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వచ్చే ఇయర్ జులై లో భీభత్సం సృష్టించ డానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కి బడ్జెట్ ఎంత అనేది నిర్మాత ముందే రివీల్ చేయగా అసలు హీరోలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు బాహుబలి సిరీస్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ ఈ సినిమా కి గాను తీసుకుంటున్నాడు అన్నది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అని చెప్పొచ్చు.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం హీరోలు ఇద్దరికీ చెరో 25 కోట్ల దాకా రెమ్యూనరేషన్ లు దక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కి కూడా తాను చేస్తున్న చిన్న రోల్ కి 5 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు ఈ రెమ్యూనరేషన్ కి తోడుగా సినిమా షేర్ లో 5% వరకు వాటా అధికంగా దక్కుతుందని టాక్. ఇవి హీరోల వరకు రెమ్యునరేషన్ అండ్ వాటాలు. ఇక రాజమౌళి సినిమాకి ఏమి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. కానీ సినిమా ప్రాఫిట్స్ లో…

30% వరకు షేర్స్ రాజమౌళి తీసుకుంటాడని సమాచారం, అది టోటల్ ఫ్యామిలీ రెమ్యూనరేషనా లేక జక్కన్న ఒక్కడి రెమ్యునరేషనా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ సినిమా టోటల్ గా 500 కోట్ల షేర్ వసూల్ చేస్తే అందులో 90 కోట్లు జక్కన్న కి రెమ్యునరేషన్ కింద వెళుతుంది. బాహుబలి తో ఇండియా లో నంబర్ 1 డైరెక్టర్ అవ్వడం తో ఆ మాత్రం తీసుకోవడం లో పెద్ద తప్పేమీ లేదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here