Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్స్!

ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్స్!

1

        నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వబోతుంది, కాగా సినిమా ని టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 70.5 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గ 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.

తొలిరోజు సంక్రాంతి సినిమాలలో ది బెస్ట్ అండ్ సోలో రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సుమారు 1300 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా సినిమా కి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ టికెట్ సేల్స్ ని చూసుకుంటే మెల్లిగా ఇంప్రూవ్ అవుతున్న ఈ సినిమా..

ఇప్పటి వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ కౌంట్ 35% వరకు ఓవరాల్ గా ఉంటుంది అని చెప్పాలి. ఆఫ్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ 10% వరకు ఉంటుంది అని చెప్పాలి. తొలి రెగ్యులర్ షో సమయానికి ఈ కౌంట్ పెరిగి 45% వరకు వెళ్ళే అవకాశం ఉంది.

ఇక తర్వాత సినిమా టాక్ ని బట్టి రోజు మొత్తం గ్రోత్ ఉండే చాన్స్ ఉంది, ఈ లెక్కన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మినిమమ్ లో మినిమమ్ 10 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ పక్కా అని చెప్పొచ్చు. ఇక సినిమా టాక్ ని బట్టి ఈ లెక్క…

రోజు ముగిసే సమయానికి పెరగడం జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో మాత్రం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అక్కడ సొంతం చేసుకోవడం మాత్రం పక్కా అని చెప్పాలి. వర్కింగ్ డే రిలీజ్ అవ్వడం వలన కలెక్షన్స్ ఓపెనింగ్స్…

కొంచం తక్కువగా అనిపించడం మాత్రం ఖాయం…అందునా సంక్రాంతి రేసు లో మిగిలిన సినిమాల తో పోల్చితే సోలో గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ను ఏలే అన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్న సినిమా అవ్వడం తో సినిమా మొదటి రోజు మరింతగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.

అది జరగాలి అంటే సినిమా టాక్ అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటేనే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. 2018 ఇయర్ లో వచ్చిన మహానటి లాంటి బయోపిక్ రేంజ్ టాక్ వస్తే కలెక్షన్స్ జోరు ఓ రేంజ్ లో పెరగడం ఖాయం. మరి సినిమా మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. మీ గెస్ ఎంతో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

  1. Collections ni hit failure ni ee chitramlo chudakandi manaku theliyani mahanubavudi kathani thelusukundham nerchukundham aacharidham aadapaduchulaki Anna aandrulaki aaradhyadhaivam NTR NTR NTR NTR NTR THE GOD IN INDIA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here