Home గాసిప్స్ పనులు మొదలు అయ్యాయి అంటూ షాక్ ఇస్తున్నారే!!

పనులు మొదలు అయ్యాయి అంటూ షాక్ ఇస్తున్నారే!!

0

     టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండేళ్ళు గా తన డేట్స్ అన్నీ ప్రస్తుతం చేస్తున్న ప్రేస్టీజియస్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కే కేటాయించిన విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వచ్చే ఇయర్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న నేపధ్యంలో టాలీవుడ్ వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్స్ లో ఒకటిగా చేరింది.

కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే, ఇక సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ ఉగాదికి జరగగా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజున సినిమాలో రామ్ చరణ్ లుక్ తో పాటు…

ఇంట్రో టీసర్ ని కూడా ఓ రేంజ్ లో ముందే ప్లాన్ చేసి తెరకెక్కించారు, దాంతో అంచనాలు పీక్స్ కి వెళ్ళగా ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే కొద్ది రోజుల్లో ఉండగా ఎన్టీఆర్ క్యారెక్టర్ లుక్ అండ్ ఇంట్రో టీసర్ ఎ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా టీసర్ పనులు మొదలు అయ్యాయి అని టాక్ వచ్చింది కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆ టీసర్ వచ్చే అవకాశం తక్కువే అంటున్నారు, సినిమాలో ఎన్టీఆర్ ఫూటేజ్ ని కట్ చేసి చిన్న ఇంట్రో ప్లాన్ చేయాలి అనుకున్నారు కానీ ఎక్కడైనా తప్పు జరిగి లీక్ అయితే బాగుందని హోల్డ్ లో పెట్టాడట రాజమౌళి.

దాంతో లుక్ మట్టుకు రిలీజ్ అయ్యే చాన్స్ ఉన్నప్పటికీ టీసర్ ప్రస్తుతానికి అయితే కష్టమే అంటున్నారు, రిస్క్ చేసి ఫూటేజ్ ను అరేంజ్ చేయడం లేదా స్పెషల్ కేర్ తో ఎన్టీఆర్ తో స్పెషల్ టీసర్ షూట్ చేయడంలో ఎదో ఒకటి జరిగితే తప్పితే ఎన్టీఆర్ బర్త్ డే కి టీసర్ వచ్చే చాన్స్ తక్కువే అంటున్నారు. మరి ఏది జరుగుతుందో కొన్ని రోజుల్లో తేలనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here