బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మీద ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉండగా ఆ అంచనాలకు తగ్గ టాక్ రాకపోయినా కూడా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా…
టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ 23 ఏళ్ల క్రితం మొదలు అయ్యింది. అదేంటంటే టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించే హీరో తర్వాత సినిమా విజయాన్ని మాత్రం అందుకోవడం కష్టమే అని ఇప్పటి వరకు రుజువు అయింది. ఇదంతా మొదలు అయ్యింది ఎన్టీఆర్ సినిమాతోనే…
స్టూడెంట్ నంబర్ 1 సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు మూవీ అట్టర్ ఫ్లాఫ్ అవ్వడంతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత మళ్ళీ సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, సై తర్వాత బంగారు బుల్లోడు, చత్రపతి తర్వాత పౌర్ణమి…విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్….యమదొంగ తర్వాత కంత్రి…
మగధీర తర్వాత ఆరెంజ్, మర్యాద రామన్న తర్వాత అప్పలరాజు, ఈగ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు, బాహుబలి తర్వాత సాహో, ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య ఇలా వరుస పెట్టి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన హీరోలకు తర్వాత సినిమా కొన్ని సందర్భాలలో యావరేజ్ గా నిలిచినా ఎక్కువ ఫ్లాఫ్స్ ఒక్క హిట్ కూడా దక్కలేదు…
ఇలాంటి టైంలో ఆర్ ఆర్ ఆర్ లో నటించిన తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ మొదటి రోజు సినిమా టాక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నెగటివ్ గా ఉంది. దాంతో మళ్ళీ రాజమౌళి కర్స్ నిజం అవుతుంది అనుకుంటూ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మాస్ పవర్ ను చూపెట్టి తను మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ను తానె ఇప్పుడు బ్రేక్ చేసి సంచలనం సృష్టించి చరిత్ర సృష్టించాడు…రాజమౌళి మిత్ అనేది ఓ రేంజ్ లో పాపులర్ అవ్వగా ఆ మిత్ బ్రేకర్ గా నిలిచి ఎన్టీఆర్ ఎట్టకేలకు దీనికి ఎండ్ కార్డ్ వేశాడు…తన వల్ల మొదలైన ఈ అపకీర్తికి తానె బ్రేక్ చేయడం మామూలు విషయం కాదు.