నట సింహం నందమూరి బాలక్రిష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొలి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మరి సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…
మామూలు ఉద్యోగం చేసుకునే వ్యక్తీ తనకి ఇష్టం అయిన నటనలో స్థిర పడాలి అని ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లో కి వచ్చి ఇబ్బందులను ఎదురుకున్నా తర్వాత ఎలా అశేష అభిమానుల ఆరాధ్య దైవం అయ్యాడు అన్నది స్టొరీ పాయింట్ అని అంటున్నారు.
మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు ఓ లెజెండ్రీ నటుడిని అడుగడుగునా మెప్పించిన బాలయ్య ప్రతీ సీన్ లో ఆకట్టుకోగా ముఖ్యంగా 60 ఏళ్ల ఎన్టీఆర్ గా మాత్రం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ఆకట్టుకున్నాడు అని అంటున్నారు. యంగ్ ఎన్టీఆర్ గా మరింత స్లిమ్ అయ్యి ఉంటె బాగుండేది అంటున్నారు.
ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ల పరిచయం నటుడిగా ఎన్టీఆర్ ఎదిగిన తీరు ని చూపెట్టిన దర్శకుడు సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ తో పాటు సినీ లైఫ్ తో పాటు ప్రజలకు సేవ చేయాలి అన్న థాట్ నుండి పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే సీన్స్ బాగా తెరకెక్కించాడు అంటున్నారు.
ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫస్టాఫ్ అద్బుతంగా ఉండగా సెకెండ్ ఆఫ్ కొంచం ప్రిదిక్ట్ చేసే విధంగా అక్కడక్కడా కొంచం బోర్ కొట్టే విధంగా కథ సాగుతుందని అంటున్నారు, చివరి ఎపిసోడ్ మాత్రం మంచి ఆసక్తి కలిగించే పాయింట్ తో ముగించి…
ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ నుండి బయటికి వచ్చేలా చేస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ లో సినిమా కి మంచి టాక్ లభించింది అని చెప్పాలి, ఇక రెగ్యులర్ షోల కి ఇదే రేంజ్ టాక్ వస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఏలడం ఖాయం.
సూపర్ హిట్