బహుశా తెలుగు సినిమా చరిత్ర లో నే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి స్లో గా ఉంది అన్న టాక్ తో పాటు ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో పాటు మినిమమ్ 3 స్టార్ రేటింగ్ దక్కింది.
ఏ సినిమా కి అయినా పాజిటివ్ టాక్ తో పాటు 3 స్టార్ రేటింగ్ అంటే ఆ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని అంతా భావిస్తారు, కానీ ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి మాత్రం ఊహకందని లెవల్ లో షాక్ ఇచ్చింది.
పొలిటికల్ కారణాల లేక సినిమాలో ఎన్టీఆర్ ని మరీ దేవుడి లా చూపెట్టడమా లేక బయట బాలయ్య పై కొందరు చేసిన నెగటివ్ కామెంట్స్ ఇలా అన్ని సినిమా ఫలితం పై ఎంతో కొంత ప్రభావం చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ షాక్ ఇచ్చే విధంగా అసలు కలెక్షన్స్ లేక…
రిలీజ్ అయ్యి 10 రోజులు అయిపోయినా 20 కోట్లు కూడా అందుకోలేక షాక్ ఇచ్చింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా. దాంతో సినిమా ని ఏకంగా 70.5 కోట్లకు అమ్మడం తో ఇప్పుడు నష్టాలు ఏకంగా 49 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
టాలీవుడ్ చరిత్రలో అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల తర్వాత బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా ఎన్టీఆర్ కథానాయకుడు చేరడం కన్ఫాం అయింది. దాంతో హిట్ టాక్ తో ఇలాంటి కలెక్షన్స్ ని అందుకుని చరిత్రలో మరే సినిమా సాధించని బ్యాడ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.
AAA baaligaadu kaakundaa ntr annayya chesivunte naa saami ranga record la varsham kurishedi but badluck