టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2018 లో అరవింద సమేత తో ఆడియన్స్ ముందుకు రాగా తర్వాత మూడేళ్ళ టైం ని ఆర్ ఆర్ ఆర్ కే కేటాయించాడు. ఎప్పటికప్పుడు అయిపోతుంది అనుకున్న సినిమా ఎదో ఒక ఇబ్బంది వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉంది, ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన మరోసారి పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ ఉన్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కమిట్ అయిన కొత్త సినిమాలు కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి.
ముందు త్రివిక్రమ్ తో అనుకున్న సినిమా అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఆ సినిమా ప్లేస్ లో ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో కొత్త సినిమాను కమిట్ అయ్యాడు ఎన్టీఆర్, రీసెంట్ గా అనౌన్స్ మెంట్ జరిగిన…
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ మొదలు అయ్యాయని తెలుస్తుంది, ఇక సినిమాలో నటీనటులను కూడా కన్ఫాం చేస్తున్నారని అంటున్నారు. సినిమాలో కీలక విలన్ రోల్ కి గాను ఈ సారి కొత్త కాంబినేషన్ ట్రై చేయాలనీ చూస్తున్నారని తెలుస్తుంది.
అందుకోసం తమిళ్ నుండి తెలుగు లో విలన్ గా అదరగొట్టిన అరవింద్ స్వామి ని ఎన్టీఆర్ కొరటాల శివల సినిమాలో విలన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారని సమచారం. ధృవ తో ఓ రేంజ్ లో మెప్పించిన అరవింద్ స్వామి మళ్ళీ విలన్ రోల్ ని తెలుగు లో చేయనే లేదు. ఆల్ మోస్ట్ 5 ఏళ్ళు మంచి మంచి ఆఫర్స్ వచ్చినా నో చెబుతూ రాగా…
ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివల మూవీ ఓకే చెప్పే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. అదే జరిగితే హీరో విలన్ ల టఫ్ ఫైట్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు. వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా వస్తుంది అంటున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ రేంజ్ లో క్రేజ్ ని పెంచేలా ఉంటుందో చూడాలి ఇక.