నట సింహం నంద మూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో భారీ అంచ నాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అను కున్న రేంజ్ అంచనాల ను అందుకోవడం లో విఫలం అయిన విషయం తెలి సిందే. కాగా ఇప్పుడు సినిమా రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు అంచనాలను అందుకోవడానికి ఈ నెల 22 న భారీ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది.
కాగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులకు వెళ్ళగా సినిమా కి మంచి రెస్పాన్స్ అక్కడ లభించినట్లు సమాచారం. సెన్సార్ యూనిట్ సినిమా అవుట్ పుట్ పై మంచి ఇంప్రెషన్ ని ఇచ్చారట. రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే అయినా కానీ…
లాగ్ లేకుండా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే కథాంశం తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉందని, ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్ సీన్స్ బాగా వచ్చాయని అంటున్నారు. ఇక సెన్సార్ నుండి సినిమా కి క్లీన్ యు సర్టిఫికేట్ లభించడం విశేషం అని చెప్పాలి.
సినిమా ఓవరాల్ రన్ టైం కూడా బాగా తగ్గించి సుమారు 2 గంటల 8 నిమిషాలు మాత్రమె పెట్టారట. మొదటి పార్ట్ రన్ టైం భారీ గా ఉండటం కూడా సినిమా పరాజయం లో కొంత పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే, అందుకే క్రిష్ ప్రత్యెక శ్రద్ధ తీసుకుని సినిమాను ఎడిట్ చేశారట.
ఇక ఈ నెల 22 న భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలను వెనక్కి తెచ్చి లాభాల భాట పట్టాలని బయ్యర్లు ఆశిస్తున్నారు. ఇంతటి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.