Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్

0

    నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల తో భారీ ప్రెజర్ తో ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, కాగా ఇంత లో సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ అలాగే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ని ఒకసారి తెలుసు కుందాం పదండీ..

ముందుగా ట్రైలర్ లో కథ పాయింట్ మొదటి పార్ట్ లో పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత సీన్ నుండి మొదలు అవ్వగా పార్టీ గుర్తు, పసుపు కలర్ ని ఎంచుకోవడానికి కారణం ఇతర రాజకీయ నాయకులతో ఎలా కలిసారు, తన పార్టీ నుండి తనను ఎలా దూరం చేశారు అన్నది చూపెట్టారు.

అందులో కొన్ని బయట ఎక్కువగా చెప్పుకుంటున్న అంశాలు జోడించారో లేదో అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అని చెప్పాలి. హైలెట్స్ విషయనికి వస్తే మొదటి పార్ట్ లో యంగ్ ఎన్టీఆర్ లా మిస్ ఫిట్ అయిన బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ లా 60 ఏళ్ల వయసు కి బాగా సెట్ అయ్యాడు.

రెండో పార్ట్ పొలిటికల్ సమయంలో అవ్వడం తో సీనియర్ ఎన్టీఆర్ ని చాలా సీన్స్ లో దింపేశాడు బాలయ్య, డైలాగ్స్ కొన్ని సీన్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. ప్రతీ గడపలో పసుపు లా ఉండటానికే పసుపు కలర్ ని ఎంచుకున్నాను అంటూ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.

ఇక మైనస్ ల విషయనికి వస్తే బయట ప్రస్తుతం జరుగున్న పరిణామాలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఇంపాక్ట్ ఈ సినిమా పై పడేలా ఉంది, ఇది ట్రైలర్ మైనస్ కాకున్నా మూవీ కి కొంత మైనస్ అని చెప్పాలి, అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నా మరింత ఆశించాం. ఓవరాల్ గా ఇవీ ప్లస్ అండ్ మైనస్ లు. ట్రైలర్ చాలా వరకు అంచనాలను అందుకుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here