ఒక స్టార్ సీనియర్ హీరో సినిమా ఎలాంటి పోటి లేకుండా రిలీజ్ అయ్యి తొలిరోజు తొలి ఆటకే మినిమం 2.75 నుండి 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు బాగుంది, ఒకసారి ఈజీ గా చూడొచ్చు అన్న టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలా ఉన్నా తొలి వీకెండ్ వరకు అయితే మాత్రం కలెక్షన్స్ పరంగా మరీ కుమ్మేయక పోయినా కానీ…
మినిమమ్ ఎబో యావరేజ్ రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకోవాలి. కానీ నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా చేతులు ఎత్తేయగా మూడో రోజు ఆదివారం అయినా ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ లో జనాలు వస్తారు అనుకున్నా కానీ…
ఓవరాల్ గా సినిమా మూడో రోజు సాధించిన కలెక్షన్స్ రీసెంట్ టైం లో స్టార్ హీరోల సినిమా లో మూడో రోజు అతి తక్కువ వసూళ్లు అందుకున్న సినిమా గా నిలిచింది, ఇక మూడో రోజు సినిమా దాదాపు సగానికి పైగా ఏరియాల్లో నెగటివ్ షేర్ ని సొంతం చేసుకుందట.
థియేటర్స్ రెంట్స్ లో సగానికకన్నా తక్కువ కలెక్షన్స్ వస్తే ముందు సాధించిన కలెక్షన్స్ లో డబ్బులను థియేటర్ వాళ్ళు తర్వాత రోజుల్లో కలుపుతారు, దాంతో ఇప్పుడు బయటికి చెప్పుకోవడానికి షేర్ ఎంతో కొంత చెప్పినా మూడో రోజు సినిమా అన్నీ తీసేస్తే సాధించింది మాత్రం 10 నుండి 20 లక్షల రేంజ్ లోనే ఉంటుందని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.