Home న్యూస్ ఇదేమి షాక్ సామి…17 గంటల్లో ఎన్టీఆర్-మహేష్ ల రికార్డ్ గల్లంతు!!

ఇదేమి షాక్ సామి…17 గంటల్లో ఎన్టీఆర్-మహేష్ ల రికార్డ్ గల్లంతు!!

1

     మోస్ట్ అవైటెడ్ సాహో ట్రైలర్ రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది. ఈ క్రమం లో సినిమా ట్రైలర్ అతి తక్కువ సమయం లోనే ఇతర హీరోల రికార్డ్ లను తుడిచి పెడుతూ సరికొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తూ దూసుకు పోతుంది, 2 ఏళ్లుగా ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి ఆఖలి ఏ రేంజ్ లో ఉందొ చూపుతూ యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తుంది.

సినిమా ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటలు ముగియడానికి ఇంకా సమయం ఉంది, కానీ ఈ లోపే అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ ట్రైలర్ తెలుగు వర్షన్ విషయానికే వస్తే…

రిలీజ్ అయ్యి 17 గంటల లోపే 8.5 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 60 వేలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకుని నాన్ బాహుబలి రికార్డులతో దూసుకు పోతుంది, కాగా ఈ క్రమం లో మహేష్ మరియు ఎన్టీఆర్ ల రికార్డ్ ను ఈ సినిమా ట్రైలర్ బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

మహేష్ బాబు రీసెంట్ మూవీ మహర్షి ట్రైలర్ 24 గంటల్లో 7.3 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఆ రికార్డ్ ను సాహో బ్రేక్ చేసి 24 గంటల్లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయనుంది, ఇక లైక్స్ పరంగా ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ 3 లక్షల 27 వేల లైక్స్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ కొట్టగా…

ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసింది సాహో, దాంతో ఇప్పుడు 24 గంటల్లో సరికొత్త రికార్డులు నమోదు అవ్వబోతున్నాయి. మరి రానున్న ఫ్యూచర్ లో ఈ రికార్డులే సరికొత్త బెంచ్ మార్క్ గా కాబోతున్నాయి కాబట్టి ఏ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

  1. A cinema andhi ma anna ntr , ramcharan lu vastunnaru ippatidaka non bahubali non bahubali records antannur ippudu adhi non RRR ga marichi idi rasi pettukondi,ntr fans ,mega fans kaliste ettuntado RRR ki chupistam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here