Home న్యూస్ టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి…అప్పుడుంటుంది….అసలు సిసలు భీభత్సం!!

టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి…అప్పుడుంటుంది….అసలు సిసలు భీభత్సం!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో సినిమాలో వచ్చిన ఇంట్రో టీసర్ ల రెస్పాన్స్ చూస్తె అర్ధం అవుతుంది, టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ టీసర్లకు రానంత క్రేజ్ ఈ టీసర్లకు దక్కింది.

ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అంచనాలను మించి రికార్డులను సృష్టించగా అప్పటి నుండి ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం చూసిన ఫ్యాన్స్ రీసెంట్ గా భారీ డిలే తర్వాత టీసర్ రావడం తో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నారు.

టాలీవుడ్ చరిత్రలో 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి టీసర్ గా రికార్డ్ ను ఈ ఇంట్రో టీసర్ సొంతం చేసుకోగా సెకెండ్ మోస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రామ్ చరణ్ ఇంట్రో టీసర్ నిలిచింది. దాంతో కేవలం క్యారక్టర్ ఇంట్రో టీసర్స్ కే….

ఇలాంటి రికార్డులను సొంతం చేసుకోవడం టాలీవుడ్ చరిత్ర లోనే ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇది వరకు ఎన్టీఆర్ జై లవకుశ లో కూడా జై క్యారక్టర్ ఇంట్రో టీసర్ రికార్డులు సృష్టించగా ఇక్కడ ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉండటం, అవి రెండు కూడా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.

ఇక జస్ట్ క్యారక్టర్ ఇంట్రో టీసర్లకే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే సినిమా రిలీజ్ టైం లో వచ్చే టీసర్లు ట్రైలర్ లకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ రికార్డులు సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. సినిమా ఇప్పుడు 2021 లో రావడం కన్ఫాం కాగా అది ఎప్పుడు అన్నది మాత్రం మరింత టైం తీసుకుని అప్ డేట్ చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here