ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్న సినిమాలు మరొకరితో తీయడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి, కథలు నచ్చక పోవడం కావొచ్చు, డేట్స్ అడ్జస్ట్ కాక పోవడం కావొచ్చు, లేదా ఇంకా ఏవైనా కారణాలు కావొచ్చు కానీ ఒక్కోసారి అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ లో ఒకరిని అనుకుని మరొకరిని తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఒక ఆసక్తి కరమైన విషయం ఒకటి ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ తో…
సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి కెరీర్ లో 25 వ సినిమా కి ప్రిపెరేషన్ చేస్తున్న టైం, SVCC బ్యానర్ దగ్గర ఎన్టీఆర్ 25 వ సినిమా డేట్స్ ఉండగా డైరెక్టర్ ని వెతికే పనిలో ఉండగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ని చేయాలనీ భావించిన ఎన్టీఆర్ అప్పటికే….
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీ కి మల్టీ స్టారర్ ట్రెండ్ ని చూపెట్టిన శ్రీకాంత్ అడ్డాల ముకుందతో ఫ్లాఫ్ అందుకోగా అడ్డాల చెప్పిన ఒక ఫ్యామిలీ స్టొరీ ఎన్టీఆర్ కి నచ్చగా కథని కంప్లీట్ వర్షన్ ని ప్రిపేర్ చేసి తెమ్మని చెప్పాడు. కానీ డైరెక్టర్ ఎంతకీ కథ ని కంప్లీట్ చేయకపోవడం తో….
ఇక ఎన్టీఆర్ డేట్స్ ఎక్కడ మిస్ అవుతాయో అని SVCC బ్యానర్ వాళ్ళు అడ్డాల ప్లేస్ లో సుకుమార్ కథని ఓకే చేసి నాన్నకుప్రేమతో ని మొదలు పెట్టారు. అప్పటికీ కథని కంప్లీట్ చేయని అడ్డాల ఈ కథనే మహేష్ బాబుకి వినిపించగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు రిజల్ట్ దృశ్యా కథ మొత్తం సిద్ధం కాకుండానే మహేష్ సినిమాను పట్టాలు ఎక్కించాడు…
ఆ సినిమానే బ్రహ్మోత్సవం…. కథ ముందే సిద్ధం కానీ ఈ సినిమా తర్వాత సెట్స్ పైనే కథ మారుతూ ముందు అనుకున్న కథ ఒకటి అయ్యి తర్వాత ఔట్ పుట్ మరో విధంగా వచ్చి మొత్తం మీద మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మారింది. అలా అనుకోకుండా ఎన్టీఆర్ చేయాల్సిన 25 వ సినిమా మహేష్ కి వెళ్ళింది.. ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో తో చేసి బ్రహ్మోత్సవం డిసాస్టర్ నుండి తప్పించుకోగా మహేష్ ఆ ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది..