Home గాసిప్స్ 10 కోట్ల సినిమా సీనయ్య పై వినాయక్ షాకిచ్చే కామెంట్స్!

10 కోట్ల సినిమా సీనయ్య పై వినాయక్ షాకిచ్చే కామెంట్స్!

0

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో జక్కన్న తర్వాత ప్లేస్ లో నిలిచిన డైరెక్టర్ వివి వినాయక్… కమర్షియల్ మూవీస్ తో వరుస హిట్లను సొంతం చేసుకుని తనకంటూ క్రేజ్ ని సొంతం చేసుకున్న వినాయక్ తర్వాత కామెడీ ఎంటర్ టైనర్స్ విషయంలో కూడా తన మార్క్ ని చూపెట్టి మెప్పించారు, కానీ 2015 అఖిల్ సినిమా నుండి డైరెక్టర్ గా కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ రాగా మధ్యలో ఖైదీ నంబర్ 150 సినిమా…

మంచి విజయం సాధించి ఆశాలు రేపినా కానీ తర్వాత ఇంటెలిజెంట్ సినిమా మళ్ళీ తీవ్ర నిరాశని మిగిలించింది. ఇలాంటి టైం లో డైరెక్టర్ నుండి హీరోగా మారి సీనయ్య అనే సినిమాను దిల్ రాజు బ్యానర్ లో మొదలు పెట్టగా ఆ సినిమా కోసం ఏకంగా దిల్ రాజు….

10 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని కేటాయించారు… సగం షూటింగ్ జరుపుకున్న సినిమా మధ్యలోనే షూటింగ్ ఆగిపోగా, కారణాలు ఏంటో ఎవ్వరికీ తెలియలేదు, డైరెక్టర్ మాత్రం నాకు ఇంకా సినిమా కాన్సిల్ గురించి ఎలాంటి న్యూస్ లేదని, నేను స్టొరీని డెవలప్ చేస్తున్నాను అంటూ అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక రీసెంట్ గా వినాయక్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా సీనయ్య సినిమా పై స్పందించగా, ఆ సినిమా నాకు బరువు తగ్గడానికి ఉపయోగ పడింది అంతే… అంటూ కామెంట్స్ చేశారు వినాయక్. అంటే సినిమా ఆల్ మోస్ట్ మధ్యలోనే ఆగిపోయింది అన్న సంకేతాలు ఇచ్చేశారు వినాయక్. హీరోగా మారడం తనకి ఇష్టం లేదని కానీ అప్పుడు ఆ అవకాశం ఎందుకు ఒప్పుకున్నానో….

తెలియదు కానీ సినిమా వాళ్ళ నేను ఫిట్ గా మారాను, అంటూ చెప్పిన వినాయక్ ప్రస్తుతం కొత్త కథలను ప్రిపేర్ చేస్తున్నాని త్వరలో మంచి కంబ్యాక్ నా నుండి ఆశించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు, లూసిఫర్ రీమేక్ ఆఫర్ వచ్చినా కథ సెట్ అవ్వక తప్పుకున్న వినాయక్ త్వరలోనే ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయాలనీ చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here