బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి ఫామ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు, వరుస పెట్టి హిట్స్ ఇచ్చిన హీరోలు తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు, ప్రస్తుతం ఇలాంటి ఫేస్ లోనే ఉన్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Ashay Kumar)…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరో…
ఇప్పుడు చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవుతూ ఉండగా…. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ 2019 టైంలో ఓ రేంజ్ ఫాంతో రచ్చ చేసిన అక్షయ్ ఆ ఒక్క ఏడాదే 980 కోట్లు కొల్లగొట్టాడు….కేసరి సినిమా 155.7 కోట్లు మిషిన్ మంగల్ 203.8 కోట్లు హౌస్ ఫుల్4….210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.
మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయి కోవిడ్ ఎంటర్ అయిన తర్వాత అక్షయ్ కుమార్ సినిమాలు ఒకటి రెండు తప్పితే అన్నీ నిరాశ పరిచాయి….
అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2 మరియు మిషన్ రాణిగంజ్ మరియు తన లేటెస్ట్ మూవీ బడే మియా చోటే మియా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ మరియు OMG2 లు మాత్రమే ఆకట్టుకున్నాయి…. అదే టైం లో అక్షయ్ కుమార్ నటించిన…
డిజిటల్ లో, లక్ష్మీ, అతరింగి రే, కట్ పుట్లీ సినిమాలు రిలీజ్ అయ్యి నిరాశ పరిచాయి, ఓవరాల్ గా కోవిడ్ టైంలో చేసిన సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అయ్యాయి. ఒకప్పుడు ఒక్క ఏడాదిలో 980 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న హీరో కి ఇప్పుడు ఇలా వరుస ఫ్లాఫ్స్ ఇబ్బంది పెట్టడం విచారకం అనే చెప్పాలి.
ఇక అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ తో తో కలిసి చేస్తున్న బడే మియ్యా చోటే మియ్య(bade miyan chote miyan) మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు…ఈ సినిమా తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది….కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఆశించిన ఎపిక్ డిసాస్టర్ పడటంతో ఇప్పుడు సూర్య హీరోగా చేసిన ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. దాంతో పాటు వెల్ కం టు జంగల్ సినిమాలు ఇప్పుడు తన కెరీర్ కి చాలా కీలకంగా మారాయి అని చెప్పాలి.