బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఒకరు….తన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) ఆడియన్స్ ముందుకు ఎప్పుడో రావాల్సింది కానీ పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా…
సినిమా కి సాలిడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది, సందీప్ కిషన్ మార్కెట్ దృశ్యా ఈ బిజినెస్ చాలా ఎక్కువే అని చెప్పాలి. కానీ సినిమా మీద నమ్మకంతో సినిమా బిజినెస్ భారీగానే జరగగా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం సినిమా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా కి మొత్తం మీద వరల్డ్ వైడ్ గా జరిగిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#OoruPeruBhairavakona WW Pre Release Business
👉Nizam: 3Cr
👉Ceeded: 1.3Cr
👉Andhra: 4.4Cr
AP-TG Total:- 8.70CR
👉KA+ROI+OS – 1.50Cr
Total WW: 10.20CR(BREAK EVEN – 11.00CR~)
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇప్పుడు 11 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
సందీప్ కిషన్ కెరీర్ లో ఓవరాల్ గా ఈ సినిమా భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో వస్తున్నా కానీ ఈ సినిమా జానర్ ఆడియన్స్ కి థియేటర్స్ భారీగానే రప్పించే సత్తా ఉండటంతో టాక్ పాజిటివ్ గా ఉంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.