Home న్యూస్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ 24 గంటల రిపోర్ట్….ఇటు కుమ్మింది…..అటు యావరేజ్!!

టిల్లు స్క్వేర్ ట్రైలర్ 24 గంటల రిపోర్ట్….ఇటు కుమ్మింది…..అటు యావరేజ్!!

0

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నటించిన డిజే టిల్లు(Dj Tillu) మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ట్రైలర్ లో అడల్ట్ కంటెంట్ కొంచం ఓవర్ గా అనిపించగా కామెడీ సీన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో పడలేదు అనే చెప్పాలి…. కానీ ఓవరాల్ గా సీక్వెల్ హైప్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉన్న టిల్లు స్క్వేర్ ట్రైలర్ వరకు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా….

యూట్యూబ్ లో 24 గంటల్లో ఈ ట్రైలర్ కి లైక్స్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా వ్యూస్ పరంగా మాత్రం యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…మొత్తం మీద 24 గంటల్లో ఈ ట్రైలర్ కి వ్యూస్ పరంగా 3.86 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అయ్యి యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

లైక్స్ పరంగా ఈ ట్రైలర్ 230.6K లైక్స్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… కాగా డిజే టిల్లు ట్రైలర్ 3.32 మిలియన్ వ్యూస్ ను అందుకోగా లైక్స్ పరంగా 187.7K లైక్స్ ని అందుకుంది, ఆ ట్రైలర్ తో పోల్చితే టిల్లు స్క్వేర్ ట్రైలర్ కి లైక్స్ పరంగా మంచి రెస్పాన్స్ సొంతం అయినా కూడా…

వ్యూస్ పరంగా మాత్రం సినిమా మీద ఉన్న హైప్ దృశ్యా చూసుకుంటే జస్ట్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ ఎండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇక కలెక్షన్స్ పరంగా ఎలాంటి జోరుని సినిమా చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here