Home న్యూస్ పెద్ద సినిమాల వల్ల కానిది పాగల్ వల్ల అయిందిగా!!

పెద్ద సినిమాల వల్ల కానిది పాగల్ వల్ల అయిందిగా!!

0

టాలీవుడ్ లో ప్రతీ వారం సినిమాల రిలీజ్ లు అన్నవి కామన్ గా జరుగుతూనే ఉంటాయి, వాటి తాలుకూ కలెక్షన్స్ అనేవి, రిలీజ్ అయిన రోజు రాత్రి నుండి ప్రతీ ఏరియాలో రిలీజ్ అవ్వడం అన్నది సర్వ సాదారణంగా జరుగుతూనే ఉంటుంది. కొన్ని సినిమాల కలెక్షన్స్ వీకెండ్ తర్వాత నుండి రిలీజ్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఇయర్ లో వకీల్ సాబ్ సినిమా రోజు వారి కలెక్షన్స్…

Paagal 4 Days Total Collections!

అప్పటి పరిస్థితుల వలన రోజు వారి రిలీజ్ చేయకుండా 10 రోజుల తర్వాత రిలీజ్ చేశారు. ఆ పరిస్థితులు వేరు కాబట్టి ఎవ్వరూ పెద్దగా తప్పైతే పట్టలేదు. కానీ ఆ సినిమా ను పక్కకు పెడితే వేరే చిన్న పెద్ద సినిమాలు అన్నీ కూడా కలెక్షన్స్ పరంగా రోజు రిలీజ్ అవ్వకుండా అయితే లేవు…

Paagal 1st Day Collections!!

ప్రతీ సినిమా కలెక్షన్స్ బయటికి కచ్చితంగా వచ్చేవి, కలెక్షన్స్ రిలీజ్ అవ్వకుండా ఆపాలి అని చూసిన ఎక్కువ కలెక్షన్స్ చెప్పాలి అని చూసినా కానీ ట్రాకర్స్ సినిమా కలెక్షన్స్ ని ట్రాక్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ పాగల్ సినిమా…

విషయంలో మాత్రం ఒక్క ఏరియా కలెక్షన్స్ ని కూడా మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు కావొస్తున్న ఒక్క ఏరియాలో కూడా అఫీషియల్ గా కలెక్షన్స్ ని రివీల్ చేయలేదు. ఏ ట్రేడ్ కి కూడా ఆ కలెక్షన్స్ చెప్పడం లేదు. కానీ ఉన్నంతలో ట్రేడ్ వర్గాలు 4 రోజుల్లో సినిమా కలెక్షన్స్ అంచనాలను రిలీజ్ చేసినప్పటికీ కూడా…

మేకర్స్ ఒక్క ఏరియాలో కూడా కలెక్షన్స్ చెప్పక పోవడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు, ఆ విషయం పక్కకు పెడితే… టాలీవుడ్ లో ఇలా కలెక్షన్స్ ని రివీల్ చేయకుండా చూడాలని ట్రై చేసినా ఎవ్వరూ సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు ఓ చిన్న సినిమా అయిన పాగల్ కలెక్షన్స్ ని బయటికి చెప్పకుండా ఉంచడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ మొదటి వారం తర్వాత ఆటోమాటిక్ గా కలెక్షన్స్ రివీల్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here