బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి ఏళ్ళు అవుతున్న హీరో రాజశేఖర్, ఇక డైరెక్టర్ గా ఫేడ్ అవుట్ అయ్యి బీ గ్రేడ్ మూవీస్ ఎక్కువగా చేస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వీళ్ళ కాంబినేషన్ లో అప్పుడెప్పుడో ఏడేళ్ళ క్రితం తెరకెక్కిన సినిమా ఇప్పుడు పేరు మార్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఆ సినిమానే RGV దెయ్యం. 7 ఏళ్ల క్రితం ఈ సినిమా ను పట్టపగలు అనే పేరుతో…
రూపొందించగా సినిమా షూటింగ్ అయిపోయాక ఎందుకో అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అప్పటి నుండి అసలు ఈ సినిమా ఊసే లేదని చెప్పాలి. ఇక ఆ టైం లో కూడా హిట్ కొట్టి ఏళ్ళు అవుతున్న రాజ శేఖర్ మార్కెట్ కూడా బాగా పడిపోవడం తో…
ఎవ్వరూ ఈ సినిమాను పట్టించుకోలేదు. కానీ అప్పుడప్పుడు ఓల్డ్ మూవీస్ ని బయటికి తీసి జనాల మీదకి వదిలే వర్మ ఈ సినిమాను కూడా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ నెల 16 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కాగా సినిమా ముందు లవ్ స్టొరీ కి పోటిగా…
రిలీజ్ చేస్తున్నారు అని చెప్పినా, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా లవ్ స్టొరీ మూవీ పోస్ట్ పోన్ అవ్వగా వకీల్ సాబ్ కి ఓపెన్ 2nd వీక్ దొరకగా ఆ థియేటర్స్ నుండి కొన్ని ఇప్పుడు ఈ సినిమా కి వెల్లబోతున్నాయి. ఇక ఈ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాలలో ఓన్ గా కొన్ని సెంటర్స్ లో రిలీజ్ చేస్తుండగా మిగిలిన సెంటర్స్ లో 30 లక్షల రేంజ్ లో…
ఓవరాల్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 50 లక్షల వరకు షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించగలుగుతుందా ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందా చూడాలి ఇక..