టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి రేసులో నిలవడానికి సిద్ధం అవ్వగా ఎప్పటి నుండో పెండింగ్ లో మమ్మోత్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సడెన్ సంక్రాంతి ఎంట్రీ తో సర్కారు వారి పాట పెద్ద మనసు చేసుకుని తప్పుకున్నట్లు భీమ్లా నాయక్ కూడా తప్పుకుని కొత్త అప్ డేట్స్ పై పోస్టర్స్ పెట్టలేదు.
కానీ తర్వాత డేట్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోవడం, ఆంధ్రలో పరిస్థితులు మళ్ళీ పవన్ సినిమా రిలీజ్ కి వకీల్ సాబ్ లా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఏమో అని ఆలోచించుకున్నారో లేక భీమ్లా నాయక్ పండగకే పెర్ఫెక్ట్ బొమ్మ అనుకున్నారో కానీ ఇప్పుడు సినిమాను తిరిగి సంక్రాంతి రేసులో…
నిలిపారు మేకర్స్…చాలా సెంటర్స్ లో థియేటర్స్ అగ్రిమెంట్స్ కూడా అవుతున్నాయని తెలుస్తుంది…మరి ఇప్పటికే పోటి లో ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ ఫిక్స్ అవ్వగా భీమ్లా నాయక్ కూడా వస్తే థియేటర్స్ సరిపోతాయా అన్ని మూవీస్ పై కలెక్షన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇక అప్పటికే తెలుస్తుంది అని చెప్పాలి.