సాయంత్రం 6 గంటలకి సోషల్ మీడియాలో సునామీ!

0
1007

ప్రతీ ఏడాది సోషల్ మీడియా లో సరికొత్త రికార్డులతో సెన్సేషన్ క్రియేట్ చేయడం ప్రతీ హీరోల పుట్టినరోజు వేడుకల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సారి అది పీక్స్ కి వెళ్ళడానికి సిద్ధం అయింది. టార్గెట్ కూడా చాలా పెద్దదిగా ఉంది…ఆ బిగ్గెస్ట్ ట్రెండ్ ని చేయడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను ప్రతీ ఏడాది సోషల్ మీడియా లో రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్స్ తో అభిమానులు జరుపుకోవడం కామనే. ఈ సారి ఈ రచ్చ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో 24 గంటల్లో ఏకంగా 2.9 మిలియన్స్ వరకు ట్వీట్స్ పోల్ అయ్యి చరిత్ర సృష్టించారు. ఆ రికార్డ్ ను మహేష్ పుట్టినరోజు వేడుకల్లో ఫ్యాన్స్ బ్రేక్ చేశారు. ఇప్పుడు టార్గెట్ 24 గంటల్లో 4.5 మిలియన్స్…మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎలాంటి సునామీ సృష్టిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!