టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అజ్ఞాతవాసి తర్వాత పూర్తీ సమయం రాజకీయాలకే కేటాయించాలని ఫిక్స్ అవ్వగా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి రీసెంట్ గా సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యారు, అందుకున్నదే తడవుగా వరుస పెట్టి సినిమా లు చేయడం మొదలు పెట్టిన పవర్ స్టార్ ముందుగా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల్లోకి వస్తున్నానని చెప్పిన పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు గాను భారీ రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ముందుగా వకీల్ సాబ్ కి గాను పవన్ కళ్యాణ్ సుమారు… 40 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని న్యూస్ లు…
చాలా రోజుల క్రితమే రిలీజ్ అవ్వగా ఆ రెమ్యునరేషన్ కి తోడూ సినిమా సాధించే ప్రాఫిట్ లో కూడా 10-15% వరకు ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుందని న్యూస్ వచ్చింది కానీ అందులో నిజానిజాలు క్లియర్ గా తెలియరాలేదు. ఇక ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిన వకీల్ సాబ్ సినిమా లాక్ డౌన్ వలన ఆగిపోగా…
ఆల్ మోస్ట్ మరో నెల రోజుల షూటింగ్ బాలెన్స్ ఉండగా నిర్మాత దిల్ రాజు కి తిరిగి డేట్స్ చూసుకోవడం బడ్జెట్ లెక్కలు వేసుకోవడం జరుగుతుండటంతో సమ్మర్ కి అనుకున్న బడ్జెట్ కి ఇప్పుడు మారిన బడ్జెట్ కి తేడా ఎక్కువ ఉండటం తో హీరోలు దర్శకులు ఇప్పుడు రెమ్యూనరేషన్ ని తగ్గించుకోవాలి అని ఇండస్ట్రీ లో నిర్ణయాలు తీసుకుంటున్న సమయం లో…
పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా ఈ సినిమా కి గాను తానూ తీసుకోబోయే రెమ్యునరేషన్ నుండి 5 కోట్ల మేర తగ్గించుకోబోతున్నారు అన్నది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా క్లియర్ గా తెలియరాలేదు కానీ నిజం అయితే మాత్రం నిర్మాతకి ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి. మిగిలిన హీరోలు కూడా ఇదే ఫాలో అయితే నష్టాల్లో ఉన్న టాలీవుడ్ కొంతవరకు తేరుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..